Dharani Applications : ధరణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర

ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన( Dasari Harichandra ) ఆదేశించారు.

బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆన్లైన్ ద్వారా రైతు నేస్తం( Raithu Nestham ) వీడియో కాన్ఫెరెన్స్ విధానాన్ని ప్రారంభించగా, తిప్పర్తి రైతు వేదిక నుండి కలెక్టర్ పాల్గొన్నారు.

ముందుగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి వెబ్ సైట్లోని దరఖాస్తులు,ఫైళ్ళ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ధరణి( Dharani )లో ఉన్న వివిధ రకాల మాడ్యూల్స్ పై వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు.

Steps Should Be Taken To Resolve Dharani Applications Immediately District Coll

భూముల సర్వే, కోర్ట్ కేసులు తదితర అంశాలను తహసీల్దార్ స్వప్న( Tahsildar Swapna ) ద్వారా అడిగి తెలుసుకున్నారు.మండల తహసిల్దార్ తో పాటు, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లకు పలు సూచనలు చేశారు.

అనంతరం కార్యాలయ ఆవరణలో సైదుబాయిగూడెంకి చెందిన దివ్యాంగురాలు జక్కా లక్ష్మి తనకు రేషన్ కార్డు కావాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ఇవ్వగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.రేషన్ కార్డుతో పాటు ఉపాధి చేసుకునేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.

Advertisement

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,ఆర్డిఓ రవి, తిప్పర్తి తహసిల్దార్ స్వప్న, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News