కర్నూలు: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీల లెక్కింపు నిర్వహించిన ఆలయ అధికారులు.ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారులు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది.
28రోజులు గాను స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన కానుకలు నగదు రూపంలో 2కోట్ల, 69లక్షల,92వేల,477 రూపాయలు.వీటితో పాటు బంగారం 170 గ్రాములు, 8కేజీల 450 గ్రాముల వెండి, భక్తులు స్వామి అమ్మవార్ల కు సమర్పించారు.
185 u.s.a.డాలర్లు,135 ఇంగ్లాండ్ పౌండ్స్ పాటు మరి కొంత విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా భక్తులు సమర్పించినట్లు ఈవో ఎస్.లవన్న తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది,శివసేవకులుపాల్గొన్నారు.