ఆ సినిమా చెయ్యడం వల్ల ప్రాణ భయం తో దేశం వదిలి పారిపోయిన శ్రీకాంత్!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మ్యాన్లీ గా కనిపిస్తూ కేవలం కుటుంబ తరహా పాత్రలను పోషించి, ఫ్యామిలీ హీరో గా పేరు తెచ్చుకున్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు శ్రీకాంత్( Srikanth ).ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీకాంత్, కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు మరియు విలన్ రోల్స్ చేసుకుంటూ ఆ తర్వాత హీరో గా మారాడు.

 Srikanth Fled The Country Fearing For His Life Because Of Doing That Movie, Khad-TeluguStop.com

హీరోగా మారిన తర్వాత ప్రారంభం లో పెద్దగా హిట్ సినిమాలు రాలేదు కానీ, తాజ్ మహల్( Taj Mahal ) అనే చిత్రం నుండి శ్రీకాంత్ కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.అదే ఆయన కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్.

ఆ తర్వాత అలాంటి సూపర్ హిట్స్ మరియు ఫ్లాప్స్ ఎన్నో చూసి 100 కి పైగా చిత్రాలలో హీరో గా నటించాడు.అప్పుడప్పుడు చిరంజీవి , నాగార్జున మరియు వెంకటేష్ వంటి హీరోల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేవాడు శ్రీకాంత్.

Telugu America, Khadgam, Muslims, Pakistan, Prakash Raj, Ravi Teja, Srikanth, Ta

అయితే శ్రీకాంత్ కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్న ‘ఖడ్గం( Khadgam )’ చిత్రం మాత్రం ఎంతో ప్రత్యేకం.ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, శ్రీకాంత్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అప్పటి వరకు కేవలం సాఫ్ట్ పాత్రలకు మాత్రమే పరిచయమైన శ్రీకాంత్, ఈ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు.సినిమాలో సగం వరకు ఆయనకీ ఎలాంటి డైలాగ్స్ ఉండవు.

కేవలం సీరియస్ లుక్స్ తో సన్నివేశాలను లాక్కొచ్చాడు.అయితే ఈ చిత్రం లో శ్రీకాంత్ ఏ హీరో చెయ్యని డేరింగ్ అట్టెంప్ట్ చేసాడు.

పాకిస్థాన్( Pakistan ) ని విపరీతంగా ద్వేషించే శ్రీకాంత్, ముస్లిమ్స్ పైన కూడా ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో పెను దుమారమే రేపింది.ఈ సినిమాని ఆపివెయ్యాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్స్ ధర్నాలు చేసారు.

మూవీ యూనిట్ బయట కనిపిస్తే చంపేస్తాం అనేంత కోపం లో ఉండేవారు అప్పట్లో ముస్లిమ్స్.

Telugu America, Khadgam, Muslims, Pakistan, Prakash Raj, Ravi Teja, Srikanth, Ta

విడుదల రోజు ఉన్న సినిమాలో ముస్లిమ్స్ పై డైలాగ్స్ ఎంతో ఘోరంగా ఉండేవి, కానీ విడుదల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అశాంతి వాతావరణం నెలకొనడం తో ఆ సన్నివేశాలను బాగా కట్ చేసారు.అయినా కూడా గొడవలు ఆగలేదు, ఇక రాష్ట్రము లో ఉన్న పరిస్థితి ని గమనించిన శ్రీకాంత్, తనపై ఎప్పుడైనా దాడి జరగొచ్చు అనేది మైండ్ లో బలంగా ఫిక్స్ అయ్యి, తన పాకెట్ లో గన్ ని పెట్టుకొని తిరిగేవాడు.ఇక్కడే ఉంటే కచ్చితంగా ఎదో ఒకటి జరిగేలాగే ఉందని గమనించిన శ్రీకాంత్ కొన్ని రోజులు ఈ వివాదాలకు దూరం గా అమెరికా కి వెళ్ళిపోయాడు.

ఇక్కడ పరిస్థితులు చెక్కబడిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube