ఇంకా బతకాలనే ఆశ ఉంది.. ఆ ఆశను సోనూసూద్ తీరుస్తున్నారు!

సోనుసూద్ ఈ పేరు తెలియనివారు బహు ఎవరు ఉండకపోవచ్చు.అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రలో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందాడు.

 Soonu Sood, Helping Nature, Sri-kanaka-mahalakshmi-lucky-draw, Diwal Special, Ma-TeluguStop.com

అటు రీల్ లైఫ్ లో అందరి హృదయాలను దోచుకోవడమే కాకుండా, ఇటు రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.కరోనా సమయంలో సోను సూద్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు.

వలస కూలీలు కాలినడకన తమ స్వగ్రామాలకు చేరుకుంటున్న హృదయ విదారక ఘటన చూసి చలించిపోయిన సోనుసూద్ వారందరికి ప్రత్యేకంగా బస్సులు, విమానాలను ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు చేర్చారు.

కొద్ది నెలల క్రితం చిత్తూరు జిల్లాలో తన సొంత కూతుళ్లను ఎద్దులు గా ఉపయోగించుకొని తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న ఆ రైతుకు ట్రాక్టర్ ను పంపించి మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు.

ఇలా సోను సూద్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ టీవీ లో శ్రీ కనకమహాలక్ష్మి లక్కీ డ్రా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, రోజా గ్రేస్ ఫుల్ స్టెప్పులతో ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనున్నారు.

ఈ ఈవెంట్లో భాగంగా రియల్ హీరో సోనుసూద్ నుంచి సహాయం పొందిన ఎంతోమందిని ఈ శ్రీ కనకమహాలక్ష్మి లక్కీ డ్రా స్టేజ్ పై సందడి చేయనున్నారు.ఈ వేదికపై మల్లికార్జున అనే ఒక వ్యక్తి సోనుసూద్ నుంచి సహాయం పొంది తిరిగి తను పునర్జన్మను పొందానని కన్నీటి పర్యంతమయ్యాడు.మల్లికార్జున అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి వెళితే అక్కడి డాక్టర్లు గుండెకు సంబంధించినటువంటి ఎముక పూర్తిగా దెబ్బతిందని, ఏ క్షణంలో అయినా చనిపోవచ్చని చెప్పారు.

కానీ నాకు మాత్రం బతకాలనే ఆశ ఉంది.చికిత్సలో భాగంగా కరెంట్ షాక్ ఇస్తున్నారు.వైద్యం కోసం కుటుంబం ఎంతో ఇబ్బందులు పడింది.నేను లేకపోతే నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లయినా జీవిస్తారని నిర్ణయించుకున్నాను.

నా గురించి తెలుసుకున్న సోను సూద్ సర్ నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.” వైద్యానికి అయ్యే ఖర్చు గురించి నువ్వు మర్చిపో“, నేను చెప్పిన ఆస్పత్రికి వెళితే మీ పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యే వరకు నువ్వు బ్రతికే ఉంటావని, నేను మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నానని చెప్పారు.అని సదరు బాధితుడు చెప్పడంతో తాజా ప్రోమో విడుదల అయింది.మల్లికార్జున కన్నీటి గాథ విని ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురయ్యారు.అయితే ఈ తాజా ప్రోమోను మీరు కూడా చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube