నైరుతి వచ్చేసిందోచ్

నల్లగొండ జిల్లా: దక్షిణ అండమాన్‌ సముద్రం,నికోబార్‌ దీవులు,మాల్దీవులు,కొమోరిన్‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు ఆదివారం విస్తరించాయి.

ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ),తెలంగాణ వాతావరణ కేంద్రం ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.

మాల్దీవుల్లో కొన్ని ప్రాంతాలు,కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు,దక్షిణ అండమాన్‌ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు ఆదివారానికి నైరుతి ప్రభావంతో రుతుపవనాలు చేరుకున్నాయని ఐఎండీ తెలిపింది.ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని,ఇది క్రమంగా ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ అంతర్గత కర్నాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 31కి.

మీ.ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని,ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగేయ,నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

Advertisement

బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.రుతుపవనాల రాకలో ఏటా వ్యత్యాసం రుతుపవనాలు కేరళకు 31కు చేరుకుంటాయని ఐఎండి గతంలో ప్రకటించింది.

ఐఎండీ డేటా ప్రకారం గత 150 సంవత్సరాల్లో కేరళకు నైరుతి రుతుపవనాల రాకలో ఏటా వ్యత్యాసం ఉంటుంది.అత్యంత తొందరగా 1918లో మే 11నే కేరళకు చేరుకోగా,1972లో అత్యంత ఆలస్యంగా జూన్‌ 18న వచ్చాయి.గత ఏడాది కూడా ఆలస్యంగా జూన్‌ 8న వచ్చాయి.2022లో మే 29,2021లో జూన్‌ 3, 2020లో జూన్‌1న కేరళకు రుతుపవనాలు వచ్చాయి.పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలోనే ఐఎండి అంచనా వేసింది.

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అనేక పట్ణణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదవుతోంది.ఇది ప్రజల ఆరోగ్యం, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

భారీ ఉష్ణోగ్రతలతో పవర్‌ గ్రిడ్‌లు దెబ్బతింటున్నాయి.నీటి వనరులు ఎండిపోతున్నాయి.

ఆ సినిమాలో 100 మందితో ఫైట్ సీన్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సీన్ ఇదేనంటూ?
ప్రజా సమస్యల పరిష్కారం కొరకే మీట్ యువర్ ఎస్పీ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

దేశంలో అనేక ప్రాంతాలు కరువు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.ఇలాంటి సమయంలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనా దేశానికి భారీ ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

భారతదేశ వ్యవసాయ రంగానికి రుతుపవనాలు చాలా కీలకం.నికర సాగు విస్తీర్ణంలో 52 శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.

విద్యుదుత్పత్తికి,తాగునీటికి కీలకమైన రిజర్వాయర్లు కూడా రుతుపవనాల కాలంలోనే నిండుతాయి.జూన్‌, జులై నెలలను రుతుపవనాల నెలలుగా పరిగణిస్తారు.

Latest Nalgonda News