త్వరలోనే పుతిన్‌ని జైల్లో చూస్తాం.. చేసిన పాపం ఊరికే పోతుందా: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ( Zelensky ) రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ( Putin )చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.పుతిన్‌ ఎన్నో నేరాలు చేస్తున్నారని, వాటికి తగిన శిక్ష తప్పక అనుభవిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.

 Soon We Will See Putin In Jail Will The Sin Be Forgiven President Of Ukraine, Uk-TeluguStop.com

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న హేగ్ సిటీకి వచ్చిన జెలెన్స్కీ తాజాగా ఈ కామెంట్స్ చేశారు.బలం ఉంది కదా అని ఉక్రెయిన్( Ukraine ) దేశంపై దారుణమైన నేరాలు పుతిన్ చేశారని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఖైదీగా చూసే రోజులు దగ్గర పడ్డాయని జోష్యం చెప్పారు.

ఎంతో మంది ప్రజలను బలి తీసుకుంటున్న యుద్ధానికి పుతిన్ కారణమయ్యారని, అలాంటి వారికి జైలు శిక్ష వేయడంలో తప్పేం లేదన్నట్లు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం జెలెన్స్కీ నెదర్లాండ్స్ దేశంలో పర్యటిస్తున్నారు.ఈ దేశం నుంచి ఉక్రెయిన్‌కు మొదటి నుంచి సపోర్ట్ లభిస్తుంది.అయితే పర్యటనలో భాగంగా అధ్యక్షుడు తొలుత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు వెళ్లారు.ఆ కోర్టు వద్దకు ఉక్రెయిన్ దేశ పౌరులు రాగా.వారిని కలిసేందుకు జెలెన్స్కీ అక్కడికి వెళ్లారు.

ఈ పౌరులు తమ దేశానికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని మార్మోగించారు.

ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్ పుతిన్‌కు( Vladimir Putin ) అరెస్ట్ వారెంట్ జారీ చేసి అతనికి షాక్ ఇచ్చింది.ఉక్రెయిన్ దేశంలో సృష్టించిన మారణకాండకు బాధ్యుడిగా అతడిని వేలెత్తి చూపుతూ ఈ అరెస్టు వారెంట్ పంపించింది.మరోవైపు పుతిన్‌పై మర్డర్‌ అట్టెంప్ట్ జరగగా దీనిలో తమ హస్తం లేదని ఇప్పటికే ఉక్రెయిన్ దేశం స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube