భారత సంతతికి చెందిన సోనియా సింగల్ అమెరికన్ సంస్థ ‘‘Gap Inc’’ ప్రెసిడెంట్ అండ్ సీఈవో పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఆమె మార్చి 2020లో గ్యాప్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
దాదాపు 1,00,000కు పైచిలుకు వున్న ఉద్యోగుల బృందానికి సోనియా నాయకత్వం వహించారు.కోవిడ్ 19 కారణంగా ఈ రిటైల్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది.
ప్రస్తుత కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాబ్ మార్టిన్ తాత్కాలికంగా సీఈవో బాధ్యతలు నిర్వహించనున్నారు.కొత్త ప్రెసిడెంట్ , సీఈవో కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
కోవిడ్ వంటి క్లిష్టమైన పరిస్ధితుల్లో గ్యాప్ ను నిలబెట్టేందుకు సింగల్ స్థిరమైన నాయకత్వాన్ని వహించారని మార్టిన్ అన్నారు.
ఇకపోతే.
సోనియా నాయకత్వంలో కంపెనీలోని అతిపెద్ద బ్రాండ్ అయిన ఓల్డ్ నేవీ అమ్మకాలు 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ డాలర్లకు పెరిగాయి.ఉత్తర అమెరికా అంతటా వున్న స్టోర్ లలో ఈ బ్రాండ్ విస్తరించడంలో సోనియా కీలకపాత్ర పోషించింది.2004లో ఆమె గ్యాప్ లో చేరారు.మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వంటి వివిధ హోదాల్లో సోనియా పనిచేశారు.
భారతదేశంలో పుట్టి పెరిగిన సోనియా సింగల్ యుక్త వయసులోనే కెనడాకు వలస వెళ్లారు.కెట్టెరింగ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అనంతరం అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లు ది బిజినెస్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్ నివేదించింది.గ్యాప్‌లో చేరడానికి ముందు.
ఆమె సన్ మైక్రోసిస్టమ్స్‌లో పదేళ్లు, ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఆరు సంవత్సరాలు పలు హోదాల్లో పనిచేశారు.అలాగే ప్రఖ్యాత ఫ్యాషన్ ప్యాక్ట్ లోనూ సోనియాకు సభ్యత్వం ముంది.
జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం, మహా సముద్రాలను రక్షించడం, గ్లోబల్ వార్మింగ్‌కు ముగింపు పలకడం వంటి పర్యావరణ లక్ష్యాలకు ఇది కట్టుబడి వుంది.