మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో పాము కలకలం...!

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని నీలగిరి బాయ్స్ హాస్టల్లో బుధవారం రాత్రి పాము రావడంతో విద్యార్దులు భయాందోళనకు గురవుతున్నారు.

అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోకపోవడంతో నేడు హాస్టల్ రూమ్ లోకి పాము వచ్చేదాకా వచ్చిందని ఆరోపించారు.

యూనివర్సిటీ ఆవరణలో గడ్డి,చెత్తాచెదారం మురుగునీరు పేరుకుపోవడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని వాపోయారు.హాస్టల్ రూమ్ లోకి రావడంతో విద్యార్థులు దానిని హతమార్చారు.

Snakes In Mahatma Gandhi University Hostels, Snakes ,Mahatma Gandhi University,

Latest Nalgonda News