సాధారణంగా హిందూ మతస్తులు ఎన్నో రకాల సంప్రదాయాలను ,పద్ధతులను పాటిస్తారు.అలాగే నిత్యం భక్తిశ్రద్ధలతో వివిధ దేవతలను పూజిస్తూ వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉంటారు.
ఇలా ఎంతో భక్తి భావంతో ఉండే వారు కొందరు శనీశ్వరుడిని పూజించడానికి భయపడతారు.శనీశ్వరుడిని పూజించడం వల్ల మనకు శని ప్రభావం కలుగుతుందని భావించి శని దేవుడిని పూజించడానికి భయపడుతుంటారు ఈ క్రమంలోనే నవగ్రహాలను కూడా పూజించడానికి వెనకడుగు వేస్తారు.
కానీ శనీశ్వరుడు కేవలం తన ప్రభావాన్ని ఎవరైతే కర్మ చేసే ఉంటారో వారి కర్మకు తగ్గ ఫలితాన్ని చూపిస్తూ ఉంటారు.ఇలా శని ప్రభావ దోషం ఉన్న వారు లేదా శనీశ్వరుడిని పూజించాలి అనుకున్న వారు కొన్ని రకాల పద్ధతులను పాటిస్తూ పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి శని ప్రభావం ఉండదని చెప్పవచ్చు.
ముఖ్యంగా శనీశ్వరుడిని శనివారం పుష్పాలతో నువ్వుల నూనెతో పూజ చేయటం వల్ల మన పై ఉన్నటువంటి దోషాలను తొలగిస్తాడు.
అయితే శనీశ్వరుడికి పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి.సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు స్వామి వారికి ఎదురుగా నిలబడి పూజలు చేస్తుంటారు.కానీ శనీశ్వరుడి విషయంలో మాత్రం ఇలా చేయకూడదు.
ఎప్పుడూ కూడా స్వామివారికి ఎదురుగా నిలబడి పూజించకూడదు.స్వామివారికి పూజ చేసే సమయంలో ను లేదా నమస్కరించే సమయంలో ఎదురుగా కాకుండా పక్కన నిలబడి నమస్కరించాలి.
అలాగే సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.
DEVOTIONAL