ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) చెల్లెలు షర్మిల( Sharmila )గురించి చెప్పాల్సిన పనిలేదు.జగన్మోహన్ రెడ్డి విజయానికి ఈమె ఎంతో దోహదపడ్డారని చెప్పాలి.
పాదయాత్ర చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తన అన్నయ్యకు అవకాశం ఇవ్వాలని వేడుకోవడం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల అన్నింటిని కూడా బయటపెట్టారు.ఇలా జగన్మోహన్ రెడ్డి విషయంలో షర్మిల పాత్ర కూడా చాలానే ఉంది.
అయితే జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనతో వచ్చినటువంటి కొన్ని మనస్పర్ధలు విభేదాల కారణంగా ఈమె తెలంగాణ వెళ్లి అక్కడ పార్టీ పెట్టారు.
ఇలా పార్టీ పెట్టినటువంటి షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తూ రైతుల సమస్యలను ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికార ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఇక నిరుద్యోగ యువత కోసం షర్మిల తన వంతు పోరాటం చేశారు.ఇలా కొన్ని వేల కిలోమీటర్ల కొద్ది పాదయాత్ర చేసి పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి షర్మిల ఉన్నఫలంగా ఆ పార్టీ కార్యకలాపాలను ఆపివేశారని తెలుస్తుంది.
ఈమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.షర్మిల పార్టీ పెట్టడం మొదట్లో కొంతమంది ఈమెకు మద్దతు తెలుపుతూ వచ్చారు.
ఇలా కొందరు కీలక నేతలు షర్మిలకు మద్దతు తెలుపగా ఈమె మాత్రం తన పార్టీని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) లోకి విలీనం చేయడంతో దిక్కుతోచని పరిస్థితులలో ఈమె పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు.అలాగే మరికొందరు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు.కానీ ఈమెకు మాత్రం మద్దతుగా ఎవరు నిలబడలేదు.ఇలా ఇతర పార్టీలోకి కీలక నేతలు వెళ్లిపోవడంతో షర్మిల పార్టీలో ఆమె ఒక్కతే మిగిలిపోయారు.ఇలా రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల తన రాజకీయ జీవితంలో ఓ చెత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు.పార్టీని స్థాపించి ఒక్కసారి కూడా ఎన్నికలకు పోటీ చేయకుండా వేరే పార్టీలో విలీనం చేసినటువంటి ఘనత షర్మిలకే దక్కింది.
ఇలాంటి చెత్త రికార్డు ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పాలి.