బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ సూర్య కిరణ్ అంటే ప్రేక్షకులు సులువుగా గుర్తు పట్టలేరు కానీ సత్యం మూవీ డైరెక్టర్, హీరోయిన్ కళ్యాణి భర్త అంటే ప్రేక్షకులు సులువుగా గుర్తు పడతారు.అయితే ఒక సినిమా వల్ల సూర్యకిరణ్ జీవితం తలక్రిందులైంది.ఛాప్టర్6 మూవీ వెరైటీ కంటెంట్ ఆ కథ బయటి నిర్మాతలకు అర్థం కాదని సొంతంగా నిర్మించామని ఆయన తెలిపారు.ఈ సినిమాలో హీరోగా జగపతిబాబును తీసుకుందామని భావించానని సూర్య కిరణ్ అన్నారు.
లైఫ్ మొత్తాన్ని తలక్రిందులు చూసిన సినిమా ఛాప్టర్6 అని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా అనుకున్న ఫలితాన్ని సొంతం చేసుకోవడం కెరీర్ పై ప్రభావం చూపిందని సూర్య కిరణ్ తెలిపారు.
వైఎస్సార్ మరణం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని ఆయన చెప్పుకొచ్చారు.నేను ఒక్కడినే రన్నింగ్ రేస్ లో పరుగెత్తినా థర్డ్ ఫ్రైజ్ వచ్చేంత దరిద్రం అని సూర్య కిరణ్ కామెంట్లు చేయడం గమనార్హం.
తెలుగులో హిట్టైన దేవదాస్ మూవీని మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదని సూర్య కిరణ్ పేర్కొన్నారు.ఏది పట్టుకున్నా నష్టం మిగిలిందని ఆయన తెలిపారు.5జీ అనే సినిమా మధ్యలో వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయిందని సూర్య కిరణ్ వెల్లడించారు.నేను తీసిన సినిమాలను నా ఫ్యామిలీతో చూడాలని అనుకున్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
లాక్ డౌన్ సమయంలో 60 కథలు రాశానని ఆయన చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరిలో మంచి వాళ్లు ఉన్నారని చెడ్డవాళ్లు అన్నారని సూర్యకిరణ్ తెలిపారు.సత్యం సినిమా సక్సెస్ తర్వాత సరైన గైడెన్స్ లేక కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశానని ఆయన పేర్కొన్నారు.ధన 51 లో జూనియర్ ఎన్టీఆర్ లేక నితిన్ నటించాల్సి ఉందని సూర్య కిరణ్ అన్నారు.