రాష్ట్రావిర్భావ వేడుకల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

నల్లగొండ జిల్లా:తనకొచ్చే జీతం నుండి బడిలో పనిచేసే స్వీపర్లకు జీతాలు ఇస్తానని తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.

ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపం నందు రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల స్థూపం సాక్షిగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుండి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక స్వీపర్లకు పక్కకు పెట్టిందని,తన ఎమ్మెల్యే పదవి కాలం ఉన్నంత వరకు స్వీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేశానన్నారు.

Sensational Statement Of Miryalaguda MLA During Statehood Celebrations , MLA Dur

నియోజకవర్గ పరిధిలో వారంలో మూడు రోజులు "ఊరు.వాడ.తండా" కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి,ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించారు.గత పదేళ్ళుగా ఆయా వార్డులలో,గ్రామాల్లో, తండాల్లో జరిగిన అభివృద్ధిని సమీక్షించి, అవసరాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు స్థానికులతో ప్రణాళికలు రూపొందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, గుర్తించిన అభివృద్ధి పనులను తక్షణం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమ పూర్తి ప్రణాళిక అతి త్వరలోనే ప్రకటిస్తామన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను,అమరులైన అమరవీరులను చరిత్ర ఎప్పటికీ మరిచిపోకూడదని,వారి అందరి త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమన్నారు.

Advertisement

అలాగే తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి కష్టమో పోరాటమో కాదని,కవులు, కళాకారులు,విద్యార్థులు, విద్యావంతులు,ఉద్యోగ, ఉద్యమ సంఘాలు,సకల జనులు పోరాడి సాధించుకున్నదన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కూడా ప్రతిఒక్కరం కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News