విజయవాడలోని పలు స్పా సెంటర్లపై( Spa Centers ) ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు స్పా సెంటర్లలో సోదాలు జరిపారు.
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు( SEB officials ) నిర్వహించారు.మొత్తం 62 మంది అధికారులు పది బృందాలుగా ఏర్పడి పటమట, మాచవరం, పెనమలూరు మరియు ఎస్ఆర్ పేటలోని స్పా సెంటర్లలో సోదాలు జరిపారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే స్పా సెంటర్ల నుంచి ముగ్గురు థాయిలాండ్ మహిళలు సహా 25 మందికి పోలీసులు విముక్తి కల్పించారు.అనంతరం 25 మంది విటులతో పాటు ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పా సెంటర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.