శ్రీమంతుడు గురించి సమంత

మహేష్‌బాబు సినిమా పోస్టర్‌పై సమంత మరోసారి కామెంట్స్‌ చేసింది.గతంలో ఈ అమ్మడు ‘1’ సినిమా పోస్టర్‌పై కామెంట్స్‌ చేసి సంచలన సృష్టించింది.

 Samantha Comments On Mahesh Srimanthudu First Look-TeluguStop.com

ఆ సినిమాలో హీరో వెనుక హీరోయిన్‌ మోకాళ్లపై నడవడం సమంత విమర్శలు చేసింది.ఆ విమర్శలకు మహేష్‌బాబు కూడా నొచ్చుకున్నాడని, ఇద్దరి మద్య వ్యవహరం చెడి పోయిందనే టాక్‌ వచ్చింది.

అయితే మళ్లీ ఇన్నాళ్లకు మహేష్‌బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ పోస్టర్‌పై ఈ అమ్మడు మరోసారి స్పందించింది.అయితే ఈసారి నెగటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా స్పందించి మహేష్‌బాబుతో పాటు ఆయన ఫ్యాన్స్‌ను కూడా కూల్‌ చేసింది.

తాజాగా విడుదలైన ‘శ్రీమంతుడు’ పోస్టర్‌పై సమంత స్పందిస్తూ… ఈ పోస్టర్‌లో మహేష్‌బాబు చాలా చాలా అందంగా ఉన్నాడు.ఒక పక్కా ఫ్యామిలీ మ్యాన్‌గా మహేష్‌ కనిపిస్తున్నాడు.

ఈ సినిమా బిగ్గెస్‌ హిట్‌ అవ్వాలని మన:స్పూర్తిగా కోరుకుంటున్నాను.పోస్టర్‌ను చూస్తే చాలా సంతోషంగా ఉందంది.

ఈ సినిమా మహేష్‌బాబు సమర్పణలో మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

‘మిర్చి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.రేపు ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది.

అలాగే జులై 17న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube