నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్ధి ఎవరూ? తండ్రా.
తనయుడా? అనే చర్చ జోరుగా సాగుతోంది.సాగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం జానా తనయుడు కుందూరు జైవీర్ రెడ్డి( Kundur Jayveer Reddy ) ఒక్కరే గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తండ్రి జానారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉందని టాక్.ఇటీవల జానారెడ్డి సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే స్థాయి నాది కాదని,చేయాలనుకుంటే చేస్తానని వ్యాఖ్యానించడం ఇందుకు బలం చేకూరుతుంది.
నియోజకవర్గం వ్యాప్తంగా సీనియర్ నాయకులు అందరూ జానారెడ్డినే బరిలో ఉండాలని కోరుకుంటుంటే,యువత మాత్రం యువనాయకుడు జైవీర్ రెడ్డి పోటీలో ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వినికిడి.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో చివరిసారిగా జానారెడ్డి పోటీచేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీలో ఉండాలని సీనియర్లు ఆశ పడుతున్నట్లు సమాచారం.
ఆయన కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనితో సాగర కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే తప్పా ఈ సందిగ్దానికి తెరపడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే సాగర్ బరిలో తండ్రి,తనయుడు ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా ఈ సారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ సాగర్ లో నిలిచేది గెలిచేది తండ్రా.
తనయుడా.? చూడాలి మరి.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy