పెండింగ్ చలాన్ల గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి సర్కార్

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు.ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది.

వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకొని పెండింగ్‌ చలాన్లు మొత్తం చెల్లించాలని కోరారు.

Revanth Reddy Govt Extended Pending Challans Date, Revanth Reddy , Pending Chall

టూ,త్రీ వీలర్‌ వాహనాల చలాన్లపై 80 శాతం రాయితీ,ఆర్‌టీసీ బస్సులపై 90 శాతం,లైట్‌,హెవీ వెహికిల్స్‌పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు.వాహనదారులు పెండింగ్‌ చలాన్ల వివరాలను www.echallan.

tspolice.gov.in/publicview లో చూసి, చెల్లించాలని సూచించారు.

Advertisement

చలాన్లను మీ సేవా,టీ వాలెట్‌,ఈ సేవా, ఆన్‌లైన్‌,పేటీం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు.చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది.పెండింగ్‌ చలాన్లు 3.59 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.

Advertisement

Latest Nalgonda News