సీట్ల కేటాయింపు పై నొప్పింపక- తానోవ్వక అంటున్న రేవంత్!

వచ్చేతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బారాసాకి – కాంగ్రెస్( BRS party ) కి మధ్య మాత్రమే ప్రధాన యుద్ధం అన్న వాతావరణం ఏర్పడడంతో ఇప్పుడు కాంగ్రెస్లో టిక్కెట్ల కోసం పోటీ పెరిగింది .ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహం అన్న ఆశవహులు ఇప్పుడు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు కూడా కాంగ్రెస్ కనుకూలంగా రావడంతో ఇప్పుడు కాంగ్రెస్లో సీట్లకు డిమాండ్ పెరిగింది.

 Revant New Strategy About Tickets Issue, Revanth Reddy , Ts Politics , Congress-TeluguStop.com

టికెట్లను ఆశిస్తున్న అభ్యర్థులు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట.అయితే వీటన్నిటిని ముందుగానే ఊహిస్తున్న రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా టికెట్ల కేటాయింపులో తన పాత్ర ఏమి లేదని ,అధిష్టానమే అన్ని చూసుకుంటుందంటూ పక్కకు తప్పుకుంటున్నారు.

ఇటీవల మీడియా ముఖంగా కూడా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు టికెట్లు కేటాయింపు పై ఏ ఐ సిసి నిర్ణయించిన కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని సర్వేల రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు .

Telugu Cm Kcr, Congress, Konda Murali, Konda Surekha, Revanth Reddy, Ts-Telugu P

ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా టికెట్లు కేటాయింపు పై తన మాటను ఖాతరు చేయకుండా అధిష్టానం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు .అయితే ఇప్పటికే సీనియర్లు తనపై గుర్రుగా ఉన్నారు.ఎటుపోయి ఎటు వచ్చినా తను సేఫ్ గా ఉండాలనే ముందుచూపుతోనే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి .తనకు కావలసిన అభ్యర్థులకు వ్యూహాత్మకంగా ముందుగా అభయం ఇస్తూనే మరోపక్క సీట్ల కేటాయింపులో తనకి ఏమాత్రం పాత్ర లేదని తేల్చి చెప్పడం ద్వారా ఉబయకుసులోపరి గా ఉండాలని , సైలెంట్ గా తన పని తాను చేయాలన్న తెలివైన ఎత్తుగడ తోనే ఆయన అట్లా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.

Telugu Cm Kcr, Congress, Konda Murali, Konda Surekha, Revanth Reddy, Ts-Telugu P

ఇటీవల కొండా మురళి దంపతులు( Konda Murali ) టికెట్ కోసం రేవంత్ ని కలిసారని చూద్దామని రేవంత్ హామీ ఇచ్చారని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.మరి టిక్కెట్ల కేటాయింపుల తన పాత్ర ఏమి లేదంటూనే కొండా మురళి కుటుంబానికి ఏరకంగా హామీ ఇచ్చారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.సీనియర్ల నుంచి వచ్చే అప్లికేషన్స్ ను పక్కన పెట్టడం కోసమే ఆయన ఈ వ్యూహాన్ని పాటిస్తున్నారని తనకు కచ్చితంగా కావాల్సిన అభ్యర్థుల విషయంలో మాత్రం ఆయన ముందుగానే ఆభయం ఇచ్చారని తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube