పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీభవన్ లో ఎంపీ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది.
ఇప్పటివరకు 45 మంది ఎంపీ స్థానాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.మల్కాజ్ గిరితో పాటు ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గాలకు ఫుల్ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.కాగా మల్కాజ్ గిరి ఎంపీ స్థానం కోసం బండ్ల గణేశ్ దరఖాస్తు చేసుకున్నారు.మరోవైపు ఖమ్మం ఎంపీ స్థానం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నేత వీహెచ్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డితో పాటు సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయని పక్షంలో తానే పోటీ చేస్తానని రేణుకా చౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా రేపటి వరకు ఎంపీ స్థానాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.