ధూమ్ సినిమా చూసిన వారికి భారీ దొంగతనాలు ఎలా జరుగుతాయో తెలుస్తుంది.అయితే పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉండే చోట దొంగతనాలు చేయాలంటే ఆ స్థాయిలో రిస్క్ చేయాల్సిందే అని అందరూ అనుకుంటారు.
చిన్న చిన్న దొంగతనాలకు రిస్క్ చేస్తున్న ఈ రోజుల్లో అసలు భారీ దొంగతనాలు గురించి ఆలోచన కూడా చేయరు.కానీ విదేశాలలో మాత్రం భారీ దొంగతనాలని చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు.
టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల దొంగతనాలని సులభంగా చేసేస్తున్నారు.ఇప్పుడు అలాంటి సంఘటన జర్మనీలో జరిగింది.
ఇద్దరు దొంగలు ఓ మ్యూజియం లో ఏకంగా 7800 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకుపోయారు. జర్మనీ డ్రెస్డన్ మ్యూజియంలో గ్రీన్ వాలెట్ భవనంలో ఈ సంఘటన జరిగింది.
భవనానికి విద్యుత్ సరఫరా కట్ చేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు.దోచుకున్న సొత్తుతో దర్జాగా ఆడీకారులో ఉడాయించారు.కొన్ని వందల ఏళ్ల నాటి నగలు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు భావిస్తున్నారు.జర్మనీలోనే అత్యంత పురాతనమైన, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన మ్యూజియంలో ఈ చోరీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ ఈ మ్యూజియాన్ని దోచుకుంది.2000 సంవత్సరంలో ఆ సొమ్మును జర్మనీకి తిరిగొచ్చింది.మరల అదే స్థాయిలో జరగడం విశేషం.