రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి, ఇప్పుడు సినీ రంగంలోకి రావణలంక చిత్రంతో హీరోగా నిర్మాతగా అడుగు పెడుతున్నారు క్రిష్ బండిపల్లి.కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.ఈ చిత్రానికి బిఎన్ఎస్ రాజు దర్శకత్వం వహించారు.క్రిష్ సరసన అస్మిత కౌర్ భక్షి హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ ఇప్పటికే విడుదలై అనూహ్య స్పందన అందుకోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ స్టార్ హీరో, మా అధ్యక్షలు మంచు విష్ణు చేతులు మీదుగా రావణలంక ట్రైలర్ ని విడుదలైంది.
ఆద్యంతం ఆసక్తికరంగా అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందనే రీతిన ఈ ట్రైలర్ ని రెడీ చేశారు దర్శకనిర్మాతలు.ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న భారీ రేంజ్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా రావణలంక నిర్మాత, హీరో క్రిష్ తెలిపారు.
ఈ సినిమాలో ప్రముఖ నటులు మురళి శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది.