టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి 'ఆర్ఆర్ఆర్‌' మూవీ ప్రివ్యూ

తెలుగు ప్రేక్షకుల అయిదు సంవత్సరాల ఎదురు చూపులకు తెర పడే సమయం వచ్చేసింది.బాహుబలి 2 విడుదల అయ్యి అయిదు సంవత్సరాలు అవ్వబోతుంది.

 Ram Charan Rajamouli Ntr Movie Rrr Preview Details, Ntr, Ram Charan, Rrr, Direct-TeluguStop.com

నాలుగు సంవత్సరాల క్రితం ఆర్ ఆర్‌ ఆర్ సినిమాకు సంబంధించిన బీజం పడింది.అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన హడావుడి ఏమాత్రం తగ్గకుండా అంతకంతకు పెరుగుతూనే వచ్చింది.అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.550 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో నభూతో న భవిష్యతి అన్నట్లుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమా ను బాహుబలి 2 ని మించి తెరకెక్కించాడు.కనుక ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఈ సినిమాను చూడాలని ఉబలాట పడుతున్నాడు.కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఈ సినిమా పై ఆసక్తి ఉంది అనడంలో సందేహం లేదు.

మార్చి 25వ తారీకు అంటే రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రివ్యూ విషయానికి వస్తే… మూడు వేల మంది టెక్నీషియన్స్ తో దాదాపుగా మూడు వందల రోజుల పాటు ఈ సినిమా ను చిత్రీకరించారు.ఏకంగా 200 రోజుల పాటు హీరోలతో పాటు ఇతర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు రిహార్సల్స్ చేశారు.

వందల కొద్ది సెట్స్ ను నిర్మించారు.అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు వర్క్ చేశాయి.

ప్రతి ఒక్క చోట అద్బుతమైన విజువల్స్‌ ఉండేలా.యాక్షన్‌ సన్నివేశాల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా జక్కన్న తెరకెక్కించాడు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Rajamouli, Rrr, Pan India, Ram Charan, Rrr Previ

కేవలం యాక్షన్ సన్నివేశాల కోసం రాజమౌళి 75 నుండి 85 రోజుల షూటింగ్‌ ను చేశారట.ఆయన ఒక్కో విషయం చెబుతుంటే ఒల్లు గగురు పొడుస్తుంది.ఇద్దరు హీరోలను బ్యాలన్స్ చేస్తూ చూపించడం అంత సులభం కాదు.కాని రెండు పాత్రలను బ్యాలన్స్ చేస్తూ తద్వారా హీరోలను బ్యాలన్స్ చేసినట్లుగా జక్కన్న చెప్పుకొచ్చాడు.విడుదలకు ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌ తో వసూళ్లను దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా బాహుబలి 2 ను బీట్ చేస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube