తెలంగాణలో నేడు, రేపు వర్ష సూచన...!

నల్లగొండ జిల్లా: బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు,రేపు రెండు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌,నిజామాబాద్‌, జగిత్యాల,వికారాబాద్‌, కామారెడ్డిలో మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు.దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

కాగా, ఆవర్తనం కారణంగా నగరంలో ఆకాశం మేఘావృతంగా మారింది.రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

Latest Nalgonda News