పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

నల్గొండ జిల్లా:జిల్లాలో పట్టగలే దొంగలు బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.బుధవారం నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో దొంగలు హల్చల్ చేశారు.

పట్టపగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించిన దుండగులు తలుపులు,తాళాలు పగలకొట్టి ఇంట్లోకి చొరబడి,ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి 6 తులాల బంగారు ఆభరణాలు,20 వేల రూపాయల నగదు,మరో ఇంట్లో 40 తులాల వెండి, 6 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.ఒకేరోజు పట్టపగలు రెండు ఇళ్లలో చోరి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి,క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest Nalgonda News