'ప్రాజెక్ట్ కే'లో ప్రభాస్ ఒరిజినల్ లుక్ ఇదే.. పోస్టర్ వైరల్!

”ప్రాజెక్ట్ కే’‘( Project-K ) నుండి నిన్న సాయంత్రం ఎట్టకేలకు డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా నుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది.ఈ లుక్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

 Project-k Intriguing Original First Look Of Prabhas Unveiled, Prabhas , Project-TeluguStop.com

ఎట్టకేలకు లుక్ నిన్న రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.అయితే ఈ లుక్ ముందుగా అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ఎడిటింగ్ కాస్త తేడాగా ఉంది అనే టాక్ వచ్చింది.దీంతో ఈ పోస్టర్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయితే ప్రభాస్ ను ఈ సినిమాలో నాగ్ అశ్విన్ ప్రజెంట్ చేసే విధానం గురించి అందరిలో క్యూరియాసిటీ మరింత పెరిగింది అనే చెప్పాలి.మరి ఫ్యాన్స్ ఎడిటింగ్ లో తేడా ఉందని టాక్ రాగా ఇప్పుడు మరో పోస్టర్ ను వైరల్ చేసేస్తున్నారు.

Telugu Nag Ashwin, Prabhas, Project, Projectoriginal-Movie

ఈ పోస్టర్ మాత్రం పెర్ఫెక్ట్ అని అంటున్నారు.ఇది ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రభాస్( Prabhas ) పెర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.దీంతో ఈ ఒరిజినల్ పోస్టర్ ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు.ఎడిటింగ్ హెవీగా ఉన్న దాని కంటే ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.జులై 20న యూఎస్ లో, 21న ఇండియాలో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

Telugu Nag Ashwin, Prabhas, Project, Projectoriginal-Movie

దీంతో రేపటి కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ( Amitabh Bachchan )దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూసేలా చేస్తున్నారు.డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube