కామిక్ కాన్ లో స్టైలిష్ లుక్ లో ప్రభాస్.. ఎంట్రీతోనే అదరగొట్టేసాడు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Pan India Star Prabhas ) అంతర్జాతీయ ఈవెంట్ లోకి ప్రవేశించాడు.ఈయన నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ఈ ఏడాది శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రదర్శింప బడుతున్న విషయం తెలిసిందే.

 Prabhas New Slim And Stylish Look Viral, Prabhas, Project K, Deepika Padukone, A-TeluguStop.com

ఇదే మన ఇండియన్ మూవీ ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో మొట్ట మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది.ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”ప్రాజెక్ట్ కే'( Project K )’.

Telugu Comic, Nag Ashwin, Prabhas, Prabhas Stylish, Project, Rana Daggubati, San

పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అంతేకాదు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూసేలా చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టీమ్ నుండి ప్రభాస్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొంటున్నారు.

Telugu Comic, Nag Ashwin, Prabhas, Prabhas Stylish, Project, Rana Daggubati, San

మరి ఈ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.దీంతో ప్రభాస్ ఎంట్రీ( Prabhas at San Diego Comic-Con ) గ్రాండ్ గా ఇచ్చాడు.ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా ఈ ఈవెంట్ కు చేరుకున్నాడు.

బ్లూ కలర్ సూట్ లో గత కొన్నేళ్లలో ప్రభాస్ ను ఎప్పుడు చూడనంత స్టైలిష్ లుక్ లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు.దీంతో ఈ పిక్ ఇప్పుడు సెన్సేషనల్ అయ్యింది.

డార్లింగ్ మునుపటిలా ఆకట్టుకునే లుక్ లోకి మారిపోయాడు అని ఫ్యాన్స్ అంతా సంతోషంగా ఉన్నారు.

Telugu Comic, Nag Ashwin, Prabhas, Prabhas Stylish, Project, Rana Daggubati, San

ఇక ఇదే ఈవెంట్ లో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్( Project K Title Teaser ) రాబోతున్నాయి.అందుకే ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియా ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.జులై 20న యూఎస్ లో, 21న ఇండియాలో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నట్టు మేకర్స్ చెప్పడంతో ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies Banner ) పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube