యువతలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలి: రావుల శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ జిల్లా: విద్యార్థులు చిన్నతనం నుండి దేశభక్తిని పెంపొందించుకుంటూ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేయగలనన్న కోణంలో ఆలోచించడం ద్వారా బాధ్యతాయుతంగా ఎదగాలని యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఆగస్టు 15 పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో వన్ టౌన్ పరిధిలో చైతన్య హై స్కూల్ విద్యార్థులకు శంకర్ తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత,సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో,దేశం పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు.

Programs Should Be Organized To Develop Patriotism Among The Youth Ravula Sriniv

భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించాల్సిన అవసరం ఉందన్నారు.దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలని జాతీయభావంతో స్వాతంత్ర్య సమరంలో వేలాదిమంది దేశ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు.

అలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని,వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటాల్సిన బాధ్యత నేటి తరం చిన్నారులపైనే ఉందన్నారు.ప్రతి ఒక్కరూ తమ స్వార్ధాన్ని విడిచి సేవా గుణంతో ముందుకు సాగుతూ దేశం గర్వించేలా తల్లిదండ్రులు బాగా చెప్పుకునేలా క్రమశిక్షణాయుతంగా చదువుకోవాలని కోరారు.

Advertisement

అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలోనూ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు.భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిరక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శంకర్,ఉపేందర్ మామిళ్ళ రాజిరెడ్డి,సిరిగిరి సురేష్ రెడ్డి,బండ మధుసూదన్ రెడ్డి,నిరసన మెట్ల నాగార్జున,వంతల అవినాష్ కుమార్,భార్గవ్, శ్రీనివాస్ నాయక్,వివేక్, నరసింహరాజు,మహేష్, నాగేశ్వరరావు,యాదగిరి, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది,విద్యార్దులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News