ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధేశ్యామ్ మరియు సలార్ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి.రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
సలార్ మూవీ షూటింగ్ నేడే ప్రారంభం అయ్యింది.ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇక మరో వైపు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యిందని మోషన్ క్యాప్సర్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా ల చిత్రీకరణ అటుంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేసేందుకు దాదాపు రెండేళ్ల క్రితమే ఓకే చెప్పాడు.
అధికారిక ప్రకటన వచ్చి కూడా ఏడాది దాటింది.అయితే సినిమా షూటింగ్ ప్రారంభం మాత్రం జరగలేదు.
షూటింగ్ ఎప్పుడు అయ్యేది క్లారిటీ లేదు.
రాధే శ్యామ్ సినిమా పూర్తి అయిన వెంటనే మహా నటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంతా కూడా భావించారు.
కాని ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కిన దాఖలాలు లేవు.సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వరకు ప్రారంభం అయ్యేనా లేదా అనే విషయం క్లారిటీ లేదు.కాని ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు విషయాలను యూనిట్ సభ్యులు అధికారికంగా చెబుతూ వచ్చారు.ఇటీవలే హీరోయిన్ విషయమై ప్రకటన చేశారు.
ఇక ఈ సినిమా సంగీత దర్శకుడు మరియు సినిమాటో గ్రఫీ డైరెక్టర్ ను అధికారికంగా ప్రకటించారు.సంగీత దర్శకుడిగా మిక్కీజే మేయర్ ను ఎంపిక చేశారు.
ఇక సినిమాటోగ్రాఫర్ గా హాలీవుడ్ టెక్నీషియన్ డానీ సంచేంజ్ ను ఎంపిక చేయడం జరిగింది.మరి సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేది మాత్రం తెలియడం లేదు.
ఈ సినిమాకు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.సింగీతం శ్రీనివాస్ ఈ సినిమాకు మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.