పోస్టర్ పాలిటిక్స్ : కేసీఆర్ కనబడుటలేదు

ఏదో ఒక అంశంపై తెలంగాణ లో అధికార,  ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి .కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా,  టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది.

 Poster Politics Kcr Is Not Visible, Kcr, Brs, Bjp, Telangana Elections, Telangan-TeluguStop.com

ఇక బిజెపి ఈ విషయంలో కాస్త వెనుకబడినట్టే కనిపిస్తోంది.  ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( Kcr ) ను టార్గెట్ చేసుకుని తాజాగా వెలసిన పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనిపించడం లేదన్న పోస్టర్లు వైరల్ గా మారాయి. 

Telugu Kcr Posters, Telangana-Politics

ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు,  వరదలతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.ప్రజలు అన్ని రకాలుగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఖమ్మం పట్టణం వరదనీటితో దారుణంగా దెబ్బతింది.

తెలంగాణలో వరద పరిస్థితులను ముందుగా అంచనా వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టే  విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించి ప్రజలను పరామర్శిస్తూ, ప్రభుత్వ సాయం ప్రజలకు సరైన సమయంలో మెరుగ్గా అందించేలా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నేత కెసఆర్ సైలెంట్ గా ఇంటికి పరిమితం కావడంపై అనేక విమర్శలు రక్తం అవుతున్నాయి . 

Telugu Kcr Posters, Telangana-Politics

ఈ అంశాలపై కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయమూ జనాల్లో కలుగుతుంది.అయితే కెసిఆర్ మాత్రం ఇవేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తూ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా కేసీఆర్ చేయలేదు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం లోని కొన్ని చోట్ల కేసీఆర్ కనిపించడం లేదన్న పోస్టర్లు వెలువడడం కలకలం రేపుతోంది.ఈ పోస్టర్ల లో కేసీఆర్ ఫొటోను ముద్రించారు.” రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తా లేని ప్రతిపక్ష నేత కేసిఆర్ ” అంటూ పోస్టర్లలో ముద్రించారు.అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా విపత్తు వ్వచ్చినపుడు బాధిత ప్రజలను పరామర్శించేందుకు కేసఆర్ వెళ్లేవారు కాదని,  ఈ విషయంలో ఎన్ని రకాల విమర్శలు వచ్చినా పట్టించుకోనట్టుగానే కేసీఆర్ వ్యవహరించే వారిని , ఇప్పుడు అధికారంలో లేకపోయినా అదే ధోరణిని కెసిఆర్ అవలంబిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube