ఎంపీపీ ప్రోత్సహంతో ఐఐటి ఖరాగ్పూర్ లో సీటు సాధించిన పేద విద్యార్థి

నల్లగొండ జిల్లా: జేఈఈ(JEE) మెయిన్స్ కు ప్రిపేర్ కావడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్ధికి ఎంపీపీ అండగా నిలవడంతో ఐఐటి ఖరాగ్పూర్ లో సీటు సాధించాడు.

వివరాల్లోకి వెళితే.

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుర్రపుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పన్నితండా గ్రామానికి చెందిన రామవత్ శ్రీను,శాంతి దంపతులకు చెందిన ద్వితీయ కుమారుడు మహేష్ కి జేఈఈ మెయిన్స్ కొరకు ఎంట్రన్స్ టెస్ట్ బుక్స్ కావాలని గుర్రపు తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు రామవత్ సేవ నాయక్ ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించి వేల రూపాయలతో బుక్స్ అందజేశారు.

Poor Student Got A Seat In IIT Kharagpur With The Encouragement Of MPP, Poor Stu

వారి ప్రోత్సహంతో మరియు సలహాలు,సూచనలతో ఆత్మవిశ్వాసంతో ఐఐటి (ఖరాగ్ పూర్ ) లో సీటు సాధించిన విద్యార్థి మహేష్ ఎంపీపీని కలిసి తనకు వెన్నంటి నిలిచి ప్రోత్సహకం అందచేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపాడు.అనంతరం ఆ విద్యార్థిని అభినందించి ఆయన భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్న అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

Latest Nalgonda News