ప్రజల సమస్యలే నా ఎజెండా: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పాలనలో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు.నల్లగొండ జిల్లా చందంపేట మండలం కోరట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పిడబ్ల్యూడి రోడ్డు నుండి కోరుట్ల వరకు ఎస్టీఎస్డీఫ్ నిధుల నుంచి మంజూరైన రూ.

80 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షం ద్వారా నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు.ఎవరూ అధైర్య పడొద్దన్నారు.

అదేవిధంగా రెండు లక్షల లోపు రుణమాఫీని ప్రభుత్వం ఖచ్చితంగా మాఫీ చేస్తుందన్నారు.రానున్న రోజుల్లో ప్రభుత్వం పేదల కోసం తెల్లరేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చే ఆలోచనలు ఉందని, అర్హత గల నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

దేవరకొండని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని,దేవరకొండ ప్రజల సమస్యలే నా ఎజెండా అని స్పష్టం చేశారు.గత పాలకుల చేతుల్లో నిరాధరణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయన్నారు.

Advertisement

అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.ఈకార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏఈ శ్రీనివాస్,భాస్కర్,సత్యానంద బద్రీనాథ్,జాల నరసింహారెడ్డి, కొండ శ్రీశైలం,మాధవరెడ్డి,రామ్ సింగ్,హరికృష్ణ,వెంకన్న గౌడ్,పార్వతి,సాయి, రాథోడ్ నాయక్,బుచ్చి తదితరులు పాల్గొన్నారు.

వాడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి
Advertisement

Latest Nalgonda News