నల్లగొండ జిల్లా:పుట్టాల్సింది అయ్యప్పలు కాదు,ఇంటికొక భగత్ సింగ్,బాబాసాహెబ్ అంబేద్కర్ లు అంటూ దేవుడి పేరిట దోపిడీలు చేసే దగాకోరులకు సామాజిక పరివర్తకుడు,కమ్యూనిస్టు నేతాజీ బోరన్నగారి సుభాషన్న బహిరంగ లేఖ వ్రాశారు.
కుల మతాల సుడిగుండాలను దగ్ధం చేద్దాం.
మానవత్వం నిండిన మరో ప్రపంచాన్ని నిర్మించుటకు పోరు సల్పుదాం.విద్యార్థి యువజన శక్తులకు ప్రజా ఉద్యమకారుడు బోరన్నగారి సుభాషన్న బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.
దేవుడు దయ్యం పచ్చి అబద్ధం.స్వర్గం నరకం వట్టి బూటకం.
ప్రజల్ని మోసం చేయుటకు దోపిడిదారులు ఆడుతున్న మహా నాటకం.ప్రజా చైతన్యం కోసం కృషి చేద్దాం, మూఢనమ్మకాల భావాల నిర్మూలన కోసం సైన్స్ నిర్మిత సమాజం కోసం పోరాడుదాం,జన విజ్ఞాన నవ భారతదేశ కోసం కృషి చేద్దామని,అది విప్లవ భావాలకు మలుపు అని అన్నారు.
దేవుడికి భార్య యొక్క అవసరం ఏమిటి? దేవునికి సెక్స్ కోరికలు పుట్టడం ఏమిటి? దేవుడు భార్యతో సెక్స్ చేసి మానవుని తరహా పిల్లలను పుట్టించడం ఏమిటి? దేవుళ్ళకు ఎన్నో ఏళ్ళనుండి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టడమేంటి?ఇన్ని వేల ఏళ్ల నుండి కొన్ని వందల వేల కోట్ల పిల్లలు పుట్టాలి కదా? దేవుడు ఆడా? మగా? ఆడ దేవుడు బలహీనుడుగా ఉండడమేమిటి?ఇన్నీ బలహీనతలు ఉన్నపుడు దేవుడు ఎలా అవుతాడు? మానవుడితో సమానమే కదా?ఒక దేవుడు మరో దేవుడి శక్తితో పోల్చితే బలహీనుడు.ఉదా:నీళ్ళకు-గంగ,డబ్బుకు-లక్ష్మీ చదువుకు-సరస్వతి.గంగను డబ్బు కోసం పూజిస్తే డబ్బు ఇవ్వలేదు.
లక్ష్మీని నీళ్ళకోసం పూజీస్తే నీళ్ళు ఇవ్వలేదు.సరస్వతిని పూజిస్తే సంతానమివ్వలేదు.
ఇలా బలహీనతలు గలవారు దేవుళ్ళు ఎలా అవుతారు?ఈ దేవుళ్ళు కేవలం ఇండియాలోనే పూజించబడుతున్నారు ఎందుకు? లక్ష్మీ దేవిని పూజించే కోట్లకొలది ప్రజలు నిరుపేదలుగా ఎందుకున్నారు?లక్ష్మీని పూజించని కోట్ల అమెరికన్లు, యురోపియన్లు,అరబ్ లు కోటీశ్వర్లుగా ఉండడమేమిటి?దేవుళ్ళ చేతులలో ఇనుముతో చేసిన కత్తులు,త్రిశులాలు,చక్రాలు,గదలు భాణాలు విల్లులు ఎందుకు?ఆ ఆయుధాలతో ఇప్పుడున్నా మనుషులతో యుద్ధం చేయగలరా?నేడు మానవుల చెంతగల పిస్టోల్,రైఫిల్,ఏకె 47 గన్ వంటి ఆయుధాల ముందర త్రుప్పు పట్టిన కత్తులు కటార్లు దేనికి పనికి రావు.దేవుళ్ళు ఎందుకు మానవుల కన్నా బలహీనులు?దేవుళ్ళు ప్రయాణించే వాహనాలు ఎలుక,చిలుక,నెమలి,ఎద్దు,రథం,పులి మొవి వీరినీ తీసుకుని ఆకాశంలో కూడా ఎగురుతాయి.నేటి మానవుని చెంత బస్సులు,కార్లు, రైళ్ళు,విమానాలు,సూపర్ సానిక్ జెట్ ప్లేన్లు,సబ్ మెరైన్ లు ధ్వని వేగంతో సమానంగా ప్రయాణించే వాహనాలు ఉన్నాయి.
అంటే దేవుళ్ళ వద్ద ఉన్న జంతువాహనాలలో ప్రయాణించి మానవుని చేరుకోగలరా ఈ దేవుళ్ళు?ఆటవిక కాలంలో, జంతువుల మీద ప్రయాణించిన కాలంలో ప్రయాణించారు కాబట్టి,దేవుళ్ళ కూడా అదే కాలంలో పుట్టించారు కాబట్టి అవే జంతువాహనాలను అంటగట్టి పెట్టారు!ఆటవిక కాలంలో జంతువులను వేటాడడానికి ఇనుముతో చేసిన ఆయుధాలైనా ఈటెలు,కత్తులు, కటార్లు,బరిసెలు,బళ్ళాలు,చక్రాలు,శూలాలు మొదలగునవి దేవుళ్ళనబడే కల్పితపాత్రల చేతిలో పెట్టేశారు.ఈ ఊహజనిత పిట్టకథలు ప్రపంచంలో ఏ దేశంలో లేవు.
కేవలం మనదేశంలోనే ఉన్నాయి.మూఢ నమ్మకాల్ని వదిలేసి,వాస్తవాన్ని గ్రహించి, సమసమాజాన్ని స్థాపించండి.
మత,కుల రహిత సమాజం!బోరన్నగారి సుభాషన్న పిలుపు.సామాజిక దురాచారాలపై ప్రజా యుద్ధానికి మలుపు.
ప్రజా చైతన్యం కోసం ప్రజా నేస్తం,కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ పంపిన ఈ ప్రకటనను ప్రజా ప్రయోజనాల కోసం, బహుజన వర్గాల రాజ్యాధికారం బి.వి.ఆర్ ప్రెసిడెంట్ విశ్వాదిత్య రాజయోగి మహాత్మా గాంధీజీ బి.వి.ఆర్ మీకు పంపించడం జరిగింది.ఒక్కరు పదిమంది చొప్పున సామాజిక మాధ్యమాల్లో ప్రజా చైతన్యం కోసం బోరన్న గారి ప్రకటనను సెండ్ చేయవలసిందిగా బివిఆర్ మహాత్మా గాంధీజీ విజ్ఞప్తి చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కుల,మత సంస్థల భవనాలను అలాగే మందిర్,మసీద్,గురుద్వార్,చర్చి రకరకాల మత సంస్థల భవనాలను,ఆస్తులను విజ్ఞాన కేంద్రాలుగా,విద్యాసంస్థలుగా,వైద్య సంస్థలుగా, తీర్చిదిద్దాలని అప్పుడు మాత్రమే భారతదేశంలో నేడు నెలకొని ఉన్న భావ దారిద్యం తొలగిపోతుందని పీడిత ప్రజల ప్రియమిత్రుడు కామ్రేడ్ బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ నేడు విద్యార్థి,యువజన శక్తులకు రాసిన బహిరంగ లేఖల పేర్కొన్నారు.భావ దారిద్రం తొలగిపోకుండా కోట్లాదిమంది భారతీయుల బానిస సంకెళ్లు తొలగిపోవని,బహుజన వర్గాల బానిసత్వానికి చరమగీతం పాడాలంటే అక్షరమే ఆయుధంగా పోరాటం కొనసాగించాలని ప్రజా ఉద్యమ నేత బోరన్నగారి సుభాషన్న పిలుపునిచ్చారు.
మతం కులం మత్తుమందు లాంటిదని,అది దోపిడీదారులకు వరాలు ఇస్తుంటే పీడిత వర్గాలకు కష్టాలు,కన్నీళ్లు అసమానతుల్ని శాపాలుగా మిగులుస్తుందని,ప్రజలను మరింతగా బానిసత్వంలోకి నెట్టివేసే కుల,మత వ్యాప్తిని అడ్డుకోవాలంటే,భావదరిద్రం పోవాలంటే ఊరురా ఉండాల్సింది గుళ్ళు కానే కాదని బడులు కావాలని,విద్యాసంస్థలు నెలకొల్పబడాలని మెరుగైన విద్యా ద్వారా మాత్రమే నూతన సమాజ నిర్మాణానికి ఆవిష్కరణ జరుగుతుందని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్నగారి సుభాషన్న 8328277285 విద్యార్థి యువజన శక్తులకు రాసిన బహిరంగ లేఖలో తెలిపారు.దేవుళ్ళు దయ్యాల పేరిట డబ్బును కాలాన్ని వృధా చేసుకోవద్దని బుర్రల నిండా అజ్ఞానాన్ని ఎక్కించుకునే భావదారిద్యం అంతం కావాలని,విజ్ఞానం సైన్సును ప్రతి పౌరుడు ముఖ్యంగా మహిళలు చదవాలని పండుగలు పబ్బాల పేరిట అప్పులపాలు కావద్దని దళిత బహుజనులకు ప్రజా బంధువు కామ్రేడ్ బోరన్నగారి సుభాన్న పిలుపునిచ్చారు.
ఇంటింటా దేవుళ్ళ ఫోటోలకు బదులు ప్రజల కోసము సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల ఫోటోలు పెట్టుకోవాలని శాస్త్రవేత్తల ఫోటోలు పెట్టుకోవాలని సుభాషన్న సూచించారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy