కులాలకే కాదు... కలాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలు...!

నల్లగొండ జిల్లా:ఇంతకు ముందు ఎన్నికలు వచ్చాయంటే ప్రజలను కుల,మతాల వారిగా విభజించి తాయిలాలు ప్రకటించి,కులాల,మతాల మధ్య కుంపటి రాజేసి తమ గెలుపు కోసం కుటిల రాజకీయం చేసే రాజకీయ పార్టీలు ప్రస్తుతం ట్రెండ్ మార్చాయి.

ఎలాగో ప్రజలు కుల,మతాలుగా విడిపోయి ఎవడి డప్పు వాడే కొట్టుకుంటున్నారు.

కాబట్టి,ఇప్పుడు తమ పార్టీలు నెగ్గాలంటే కలాలపై ఫోకస్ చేయాలని భావించినట్లు కనిపిస్తుంది.నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ( Munugodu Constituency )పరిధిలో అన్ని రాజకీయ పార్టీలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులను విడగొట్టి చిన్న పెద్దా అనే వ్యత్యాసం తీసుకొస్తే ప్రజా సమస్యలను పక్కన పెట్టి,తమలో తాము కొట్టుకు చస్తారనే కుట్రకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.రాజకీయ పార్టీల అభ్యర్దులు మండల స్థాయిలో కూడా చిన్న,పెద్ద పేపర్లు,చానల్స్ అని కలం సోదరుల మధ్య కయ్యం పెట్టడాన్ని కొందరు నిఖార్సైన విలేకర్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదంతా కొద్దిమంది విలేకరులు రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడమే కారణమని భావిస్తున్నారు.ఇప్పటికైనా రాజకీయ పార్టీల వలలో చిక్కుకోకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు కలం యోధులంతా కలిసి కట్టుగా ఉండాలని కోరుతున్నారు.

Advertisement
నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు...2025 జనవరిలో పరీక్షల నిర్వహణ

Latest Nalgonda News