ఇకపై ట్రూ కాలర్ అవసరం లేదట...జూలై 15 నుంచి కొత్త సేవలు: ట్రాయ్ కీలక నిర్ణయం

నల్లగొండ జిల్లా: అపరిచిత వ్యక్తులు అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది.

దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

అయితే వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్ ను ఉపయోగిచే సమయంలో మీ ఫోన్ కాల్స్ కి సంబంధించిన పర్మిషన్స్ యాప్ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది.

No Need For True Caller Anymore New Services From July 15 TRAI Key Decision, Tr

మీ ఫోన్లోని కాంటాక్ట్స్ తో పాటు కాల్ వివరాలను సదరు యాప్స్ చేరుతాయి.అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్ అసవరం లేకుండానే ఇకపై అన్ నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్ తెలుసుకోవచ్చు.

ఇందకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై మీకు వచ్చే కాల్స్ వివరాలు ఏ యాప్ అవసరం లేకుండా స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి.

Advertisement

దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు.ఇందు కోసం ట్రాయ్ నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్ ను యాక్టివేట్ చేయనుంది.

జూలై 15వ తేదీ నుంచి ఈ సేవలను ట్రాయ్ ప్రారంభించనునట్లు సమాచారం.

Advertisement

Latest Nalgonda News