స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ట్రూ కాలర్ యాప్( True Caller app ) ను ఉపయోగిస్తూ ఉంటారు.దాదాపుగా అందరికీ ట్రూ కాలర్ గురించి తెలుసు.
మనకు వచ్చిన కాల్ ఎవరిది అని తెలుసుకోవడం కోసం ఈ యాప్ ను అందరూ ఉపయోగిస్తుంటారు.ట్రూ కాలర్ యాప్ ను ఉపయోగించే వారి సంఖ్య 100 మిలియన్ల కంటే పైగానే ఉంది.
ట్రూ కాలర్ లో ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.ఈ ఫీచర్ తో మోసపూరిత మెసేజ్లకు చెక్ పెట్టవచ్చు.
ఇటీవలే కాలంలో అన్ లైన్ మోసాలలో భాగంగా లాటరీలు, బంపర్ ఆఫర్ల పేరిట రకరకాల మెసేజ్లు వస్తున్నాయి.ఆ మెసేజ్ ను గెలికితే సైబర్ వలలో చిక్కినట్టే.
అసలు ఆ మెసేజ్ మామూలు మెసేజేనా లేక మోసపూరిత మెసేజా అనేది ఈ ఫీచర్ తో ఇట్టే తెలిసిపోతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎస్ఎంఎస్ ప్రొటెక్షన్ ఫీచర్( SMS protection feature ) ను ట్రూ కాలర్ యాప్ సరికొత్తగా తీసుకువచ్చింది.యూజర్ రిపోర్ట్ లేకుండానే ట్రూ కాలర్ సిస్టం ఆటోమేటిక్ గా మోసపూరిత మెసేజ్లను గుర్తిస్తుంది.ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.
మన మొబైల్ కు కరెంట్ బిల్ చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్లు, లోన్లు, కేవైసీ, లాటరీ లాంటి రకరకాల మెసేజ్లు వస్తున్న క్రమంలో వీటిలో మోసపూరిత మెసేజ్ ఉంటే.ఈ ఫీచర్ ఆ మెసేజ్ పై ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపిస్తుంది.
ఈ నోటిఫికేషన్ ను మ్యానువల్ గా తీసేసే వరకు స్క్రీన్ పై అలాగే ఉంటుంది.ఒకవేళ పొరపాటున ఆ మోసపూరిత మెసేజ్ ను ఓపెన్ చేసినా కూడా ఈ ఫీచర్ అందులోని లింకులను డిసేబుల్ చేస్తుంది.
ఆ మెసేజ్ సురక్షితం అని యూజర్ స్పష్టం చేస్తేనే ఈ ఫీచర్ ఎస్ఎంఎస్ ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తుంది.ఈ ట్రూ కాలర్ ఫ్రాడ్ ప్రొడక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది.