యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Siva ) కాంబో సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.మరో 11 నెలల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రతి సన్నివేశం స్పెషల్ గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ సినిమా డైలాగ్ గతంలో ఒకటి లీకై నెట్టింట తెగ వైరల్ అయింది.“యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు” అనే డైలాగ్ రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో డైలాగ్ లీక్ కాగా ఆ డైలాగ్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఎన్టీఆర్30 సినిమాలో తారక్ సముద్రవీరుడిగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.“సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది.ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం” అనే డైలాగ్ ఈ సినిమా నుంచి వైరల్ అవుతుండటం గమనార్హం.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది.ఎన్టీఆర్30 ( Ntr30 ) నుంచి లీకవుతున్న ప్రతి డైలాగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.ఈ డైలాగ్ లను తారక్ నోటి నుంచి వింటే మామూలుగా ఉండదని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జాన్వీ కూడా కొత్త యాసలో డైలాగ్స్ చెబుతుందని సమాచారం అందుతోంది.

తారక్ జాన్వీ జోడీ సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి( Janhvi Kapoor ) స్థాయిలో పేరు సంపాదించుకోవడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తారక్ జాన్వీ జోడీ బ్లాక్ బస్టర్ జోడీ అనిపించుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.ఈ జోడీ సూపర్ జోడీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.







