నాని భార్య నాకు ఆ విషయాలన్నీ చెప్పింది.. నజ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నజ్రియా..

 Nazriya Fahadh Cute Speech , Nazriya Fahadh, Ante Sundaraniki, Nani, Vivek Atrey-TeluguStop.com

ఈమె తెలుగులో ఒక్క సినిమా కూడా చేయక పోయిన అందరికి సుపరిచితమే.ఈమె అందం, అభినయం, కళ్ళతోనే పలికించగలిగే హావభావాలు అన్ని కూడా ఫ్యాన్స్ ను కట్టిపడేస్తాయి.

ఈమె కెరీర్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతున్న తర్వాత ఇప్పుడు ఈమె డైరెక్ట్ తెలుగు సినిమా చేసింది.ఈమెకు తమిళ్ లో పెద్ద ఫాలోయింగ్ ఉంది.

ఈమెను ఆరాధించే వారు కోట్లలో ఉన్నారు.చేసింది కొన్ని సినిమాలు అయినా ప్రభావం మాత్రం ఎక్కువ చూపించింది.

అయితే ఇప్పటి వరకు తెలుగులో మాత్రం అడుగు పెట్టలేదు.ఈమె నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగులో అడుగు పెట్టబోతోంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

ఇందులో భాగంగానే నిన్న రాత్రి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు.ఈ వేదికపై నజ్రియా మాట్లాడుతూ.

ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.వైజాగ్ గురించి నాని భార్య ద్వారా చాలా విన్నాను.

ఆమెది కూడా వైజాగ్ నే.సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో.సినిమా పట్ల మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం అయ్యింది.నాకు ఈ ఏడాది లోనే మూడు మంచి విషయాలు జరిగాయి.

Telugu Antesundaraniki, Nani, Nazriya Fahadh, Nazriyafahadh, Vivek Atreya-Movie

ఒకటి నేను డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడం, రెండు వైజాగ్ రావడం.మూడు నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకోవడం.అంటూ నజ్రియా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చింది.నేను యాక్ట్ చేసిన వాళ్లలో నాని ఒక మంచి యాక్టర్.తన కారణంగా ఈ సినిమాకు సంబంధించి మంచి జ్ఞాపకాలు మిగిలాయి.ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది.

తప్పకుండ చుడండి.మీరంతా తప్పకుండ ఎంజాయ్ చేస్తారు.

అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube