లోకేష్ ‘యువగళం’ అంతరార్థం ఏంటి..?

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా వరసబెట్టి ప్రజల్లో ఉంటున్నారు.

 Nara Lokesh Yuvagalam Padayatra Details, Nara Lokesh, Yuvagalam Yatra, Tdp Paday-TeluguStop.com

అటు వైపీపీ గడప గడపకు అంటూ.మంత్రుల దగ్గరి నుంచి ప్రతీ నేతను ప్రజల్లో ఉంచుతుంటే.

టీడీపీ జనసేనలు మాత్రం యాత్రలను నమ్ముకున్నాయి.ఎన్నికలు వచ్చే నాటికి ప్రజల్లో సానుకుల పవనాలు తీసుకు రావాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.

తర్వాత.దాన్ని ఎజెండాగా పొత్తు పెట్టుకుంటే.

మంచి ఫలితాలు వస్తాయని ప్లాన్ చేస్తున్నారు.నారా లోకేష్ కూడా ఈ సారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళ గిరిలో ఓడిపోవడంతో ఆయనపై బ్యాడ్ ఇమేజ్ పెరిగింది.దానికి తోడు పప్పు అని ముద్ర వేయడంతో.

మాస్ ఫాలోయింగ్ ను కోల్పోయారు.అంతే కాకుండా అరకొర తెలుగుతో పంచులు వేయడానికి ట్రై చేసి విమర్శల పాలయ్యారు.

టీడీపీ గణం మొత్తం ప్లాన్ చేసి.మాస్ హీరోగా చూపించాలని చూసినా అవేమి సక్సెస్ కావడం లేదు.

నిజానికి సీఎం జగన్ కు సైతం మంచి వాక్చాతుర్యం లేదు.అయితే ఆయన పాదయాత్రతో మాస్ ఫాలోయింగ్ సాధించారు.

అదే ప్లాన్ ను టీడీపీ అధినేత ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.వైసీపీ నేతలు ప్రతీ సారీ కుప్పం టార్గెట్ అంటూ మాట్లాడుతుండటంతో.

వాటిని తిప్పి కొట్టేందుకు.అక్కడ వారి బలం చూపించుకునేందుకు అక్కడి నుంచే యాత్రను ప్రారంభించబోతున్నారు.

నిజానికి ఏపీలో ఏ యాత్ర స్టార్ట్ అయినా.అది హిందూ పురం నుంచి ఇచ్చాపురం వరకూ సాగుతుంది.

Telugu Chandrababu, Lokesh, Lokeshyuvagalam, Tdp Padayatra, Yuvagalam Yatra-Poli

ట్రెండ్ కు విభిన్నంగా.లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది.అయితే అత్యంత సాదాసీదాగా ఈ యాత్రను మొదలు పెట్టాలని.అప్పుడే ప్రజల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు.సుమారు 400 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆయనకు మాస్ ఫాలోయింగ్ తీసుకు వస్తే.అది వచ్చే ఎన్నికల్లో ఉపయోగ పడుతుందని.

జూనియర్ ఎన్టీఆర్ అవసరం కూడా ఉండకూడదని చేస్తున్నట్టు తెలుస్తోంది.చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకోవాలని అటు కేడర్ తో పాటు.

ఇటు పార్టీ నేతలు సైతం అనుకుంటున్నారు.అయితే వాటిని పక్కన పెట్టడానికే చంద్రబాబు లోకేష్ యాత్రను తెర మీదకు తీసుకుని వచ్చినట్టు కనిపిస్తోంది.

మరి యాత్ర ముగిసే లోపు లోకేష్ ఫాలోయింగ్ సాధిస్తారా లేదా అనేది మరి కొంత కాలం ఆగితే గానీ చెప్పలేం,…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube