తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’లో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే రెండు వారాల ఎలిమినేషన్ ప్రక్రియ ఈజీగానే జరిగిపోయింది.
కానీ, థర్డ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొంచెం డిఫికల్ట్‌గా, వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.లహరి, ప్రియ మధ్యే ఎలిమినేషన్ ప్రక్రియకు పోటీ ఉన్నట్లు చర్చ జరిగింది.
అయితే, సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రియ, రవి, లహరి మధ్య గొడవే జరిగింది.ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ నుంచి ఎవరు బయటకు వెళ్తారు? కంటెస్టెంట్స్ మధ్య రచ్చ జరిగిన క్రమంలో హోస్ట్ నాగార్జున ఎవరికి క్లాస్ ఇస్తాడని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి ప్రియ ఆల్రెడీ ఎలిమినేట్ అయిందంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే, కంటెస్టెంట్స్ లహరి, రవిపై మిడ్ నైట్ హగ్స్ అంటూ ప్రియ చేసిన కామెంట్స్ హౌజ్‌లో చర్చకు తావిచ్చాయి.ఇకపోతే లహరి గురించి తాను అస్సలు తప్పుగా మాట్లాడలేదని రవి పేర్కొనడంతో పాటు తిరిగి ప్రియపైనే కామెంట్స్ చేసిన విషయం అందిరికీ విదితమే.రవి, ప్రియ మాట్లాడుకున్న వీడియో ఒకటి ఆల్రెడీ బయటకు వచ్చేసింది.
దీంతో ఈ విషయమై నాగార్జున ఎలా స్పందిస్తారో అని అందరు ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘రావణా’ పాటతో ఫుల్ సీరియస్ మోడ్‌లో అక్కినేని నాగార్జున శనివారం ఎంట్రీ ఇచ్చారు.
అందరి క్వశ్చన్స్‌కు ఈ రోజు ఆన్సర్స్ తెలియాల్సిందే అని అన్నాడు.ఇక రవి, ప్రియ నేమ్ ప్లేట్స్‌ను సుత్తితో పగులగొట్టి రవిని ఏమైంది అని ప్రశ్నించాడు.
దాంతో రవి నామినేషన్స్ సందర్భంగా జరిగిన గొడవను వివరించాడు.నామినేషన్స్‌లో లహరిని నామినేట్ చేస్తూ మధ్యలో తనను లాగిందని చెప్పాడు.
లహరి తాను హగ్ చేసుకున్నామని పేర్కొన్నాడు.ఈ క్రమంలోనే ప్రియ తమపై అర్ధరాత్రి బాత్ రూమ్ అంటూ మాట్లాడిందని వివరించాడు.
అయితే, నిజానికి అక్కడ ఏం జరగలేదని, నార్మల్‌గా హాల్‌లో హగ్ చేసుకున్నట్లే బాత్ రూంలోనూ హగ్ చేసుకున్నామని పేర్కొన్నాడు రవి.ఈ క్రమంలో నాగార్జున రవిని ఈ ఇష్యూలో మిస్టేక్ ఎవరిది అని అడగగా, ప్రియదేనని రవి తెలిపాడు.దీంతో ప్రియ మరి నువ్వేమంటావ్ అని నాగ్ ప్రశ్నించగా, తాను వాళ్లని తప్పుగా అర్థం చేసుకోలేదని ప్రియ తెలిపింది.లహరి అడిగినందుకే తాను ఆ సంగతి చెప్పానంది.
ఇక ఆ సందర్భంలో తాను మగవారు అనే విషయాన్ని స్పష్టం చేశాను అంటూ వివరించింది.ఫైనల్‌గా నాగార్జున మాట్లాడుతూ జెండర్ డిఫరెన్స్ అంటూ ఏమీ లేదని, హగ్ ఇవ్వడం అంటే బిజీగా ఉండటమా ? అంటూ కంటెస్టెంట్స్‌ను ప్రశ్నించాడు.