వైరల్: ఈ యుద్ధ విమాన విన్యాసాలు చూస్తే.. ఆశ్చర్యపోతారంతే..!

యుద్ధ విమానాల విన్యాసాలు చూస్తూ ఉంటే.ఎవరైనా సరే, మైమరిచి పోవాల్సిందే.

 If You Watch These Warplane Stunts .. You Will Be Amazed ..! Viral Latest, Viral-TeluguStop.com

ఆకాశంలో స్టంట్లు చేస్తూ అబ్బురపరిచే పైలెట్లు.చూపురులకు కన్నుల విందు చేస్తారు.

తాజాగా ఆస్ట్రేలియాలో యుద్ధ విమాన పైలెట్లు చేసిన విన్యాసాలు మాత్రం ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.గురువారం రోజులు ఆ దేశంలోని బ్రిస్బేన్‌ నగరంలోని అత్యంత ఎత్తయిన భవనాల మధ్య నుంచి ఒక యుద్ధ విమానంతో దూసుకెళ్లారు పైలెట్లు.

ఆకాశాలను తాకే ఎత్తున్న భవనాల మధ్య పెద్ద యుద్ధ విమానం తో పక్షుల మెలికలు తిరుగుతూ భయంకరమైన విన్యాసాలు చేశారు.ఈ విన్యాసాలు చూసి స్థానిక ప్రజలందరూ భయంతో హడలిపోయారు.

ఎక్కడ ఆ విమానం భవనాలను ఢీ కొడుతుందో అని కొందరు భయపడిపోయారు.మరికొందరు మాత్రం ఈ విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

ఈ విమానాన్ని నడిపేది బాగా శిక్షణ తీసుకున్న పైలెట్ అని వారంతా అంత ధైర్యంగా విన్యాసాలను దగ్గర్నుంచే వీక్షించారు.

ఇంతకీ ఈ విమానం విషయాలేంటో తెలుసుకుంటే ఇది ఆస్ట్రేలియా రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 కార్గో విమానం.

ఈ విమానాలు నడపడం చాలా కష్టం.బాగా ట్రైనింగ్ తీసుకున్న వారు మాత్రమే వీటిని హ్యాండిల్ చేయగలరు.

అయితే తాజాగా రివర్‌ ఫ్రంట్‌ ఉత్సవాలకు ముందస్తుగా రిహార్సల్‌ చేశారు.

Telugu Adventure, Flights, Latest-Latest News - Telugu

రిహార్సల్‌లే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.స్కై స్క్రాపర్స్ మధ్యన ఉన్న ఓ నదిపై ఈ యుద్ధ విమానం ఎక్కువగా తిరుగుతుంటుంది.భవనాల పై లేదా ప్రజలు నివసిస్తున్న ఇళ్లపైన ఇది ఎన్నడూ కూడా తిరగ లేదని స్థానికులు చెబుతున్నారు.

అయినా.ఇది చాలా సాహసోపేతమైన విన్యాసం అని అంటున్నారు.

నెటిజన్లు సైతం ఇది చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube