నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వల్పంగా వరద...!

నల్లగొండ జిల్లా:గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక డెడ్ స్టోరేజికి చేరుకొని కళ తప్పిన సాగరం మళ్ళీ జలకళను సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.

ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరుతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వైపుకు పరుగులు పెడుతూ వస్తుంది.

స్వల్పంగా వరద తాకిడి తగలడంతో జిల్లాలో అన్నదాతల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,ప్రస్తుత నీటి మట్టం 503.80 అడుగులు మాత్రమే ఉంది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 121.3844 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి.ప్రస్తుతం ఇన్ ఫ్లో 9500 క్యూసెక్కులుగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది.

సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు భాగ్యస్వాములు కావాలి : కలెక్టర్

Latest Nalgonda News