వైసీపీ ప్రభుత్వానికి నాదెండ్ల మనోహర్ ఛాలెంజ్..!

విశాఖ రాజధానిపై వైసీపీ ప్రభుత్వానికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఛాలెంజ్ చేశారు.రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్దామన్న ఆయన ప్రజల్లోనే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.

 Nadendla Manohar's Challenge To The Ycp Government..!-TeluguStop.com

విశాఖ రాజధానిని ఎవరూ కోరుకోవడం లేదని నాదెండ్ల తెలిపారు.విశాఖ క్యాపిటల్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు వెళ్లండని చెప్పారు.

రాజధానిపై రోజుకు ఓ ప్రకటన చేస్తుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు.ఒక మంత్రి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు… మరో మంత్రి ఇదే రాజధాని అంటున్నారని విమర్శించారు.

మరోవైపు సీఎం విశాఖకు వెళ్తున్నా అంటున్నారన్నారు.సీఎం, మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసం బూటకపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube