ముస్తాబైన సమ్మక్క సారక్క జాతర...!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం( Gajulamalkapuram ) శివారులో కొలువుదీరిన గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మ జాతర( Sammakka Saralamma Jatara ) ఈ నెల 21 నుండి 24 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముస్తాబైంది.

వరంగల్ జిల్లాలోని మేడారం గ్రామంలో కొలువదీరిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతరగా జరుగుతుండగా అదే రోజుల్లో చిన్న సమ్మక్క సారలమ్మ జాతరగా గాజుల మల్కాపురంలో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతోంది.

ఈ జాతరకు గిరిజన తండాల నుండి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉద్యోగులతో పాటు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు.భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద అన్నిరకాల వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటి చైర్మన్ నాతల వెంకట్ రెడ్డి ( Natala Venkat Reddy )తెలిపారు.

జాతర సందర్భంగా దాతల సహకారంతో తెలుగు రాష్ట్రాల స్థాయి డాన్స్,మహిళల కోలాట పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు.క్రీడాకారులకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా క్రీడలలో పాల్గొనవచ్చని అన్నారు.

రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి
Advertisement

Latest Suryapet News