నల్లగొండ జిల్లా:కొల్లగొడుతుండ్రు-గుల్ల జేస్తుండ్రు "సార్ల" కక్కుర్తి-వ్యవస్థకే అపకీర్తి, మసకబారిన హరిత సాధన-యథేచ్ఛగా (గ)లీజుల మాయాజాలం.గుట్టలన్ని కొల్లగొడుతుండ్రు-గల్లపెట్టే నింపుకుంటుండ్రు.
వన్యప్రాణులకు,చారిత్రక ప్రాంతాలకు కరువైన రక్షణ.హద్దులు మీరుతున్న మైనింగ్ మాఫియా చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.
మైనింగ్ దొంగలపై ఉక్కుపాదం మోపేదెవరు? సీఎం కేసీఆర్ కు సిపిఐ (ఎం-ఎల్) నేత బోసన్న లేఖ హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో అనేకచోట్ల అక్రమ మైనింగ్ వ్యాపారం మూడు పువ్వులు,ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతుందని,అధికారుల అవినీతి, పాలకుల అండదండలతో గుట్టలన్ని చెల్లాచెదురై గుల్లబారుతున్నాయని,పచ్చదనం-పరిశుభ్రత నేలకోరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి,ప్రజా ఉద్యమకారుడు బోర సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఆరోపించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కు బుధవారం ఒక బహిరంగ లేఖ వ్రాసి విడుదల చేశారు.
కొన్నిచోట్ల అసలు అనుమతి లేకుండా తవ్వుకుపోతున్నారని,మరికొన్ని చోట్ల అనుమతి తీసుకున్నా పరిమితికి మించి హద్దులు దాటి కొండల్ని కరిగిస్తున్నారని,వేలకోట్ల విలువైన మట్టిని,రాళ్లను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారని కేసీఆర్ కు రాసిన లేఖలో బోసన్న పేర్కొన్నారు.కొంతమంది లీజు ఒక చోట,తవ్వకాలు మరొకచోట కొనసాగిస్తున్నారని, హద్దులు మీరిన మైనింగ్ మాఫియాపై సర్కార్ పెద్దలు ప్రేమను చూపించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాదు,జీవవైవిధ్యం అలారారే అందాల అడవులు,వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆదిమానవుల ఆవాస ప్రాంతాలతో సహా ధ్వంసమవుతున్నాయని బోరన్న ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ,రంగారెడ్డి,హనుమకొండ జిల్లాల్లో మైనింగ్ దందా జోరుగా కొనసాగుతుందని, హనుమకొండ,వరంగల్ జిల్లాలకు మిగిలిన ఏకైక అటవీ ప్రాంతం దేవునూర్ పరిధిలో 692 ఎకరాల వరకు అడవి ఉందని,ఇందులో ఎర్ర మట్టితో పాటు నల్లరాయి,ఇనుప ఖనిజం ఉండడంతో మైనింగ్ అక్రమార్కుల కన్ను పడిందని సుభాషన్న తెలిపారు.మైనింగ్ దొంగలు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని అడవిలో అడ్డదారులు వేసి లారీల్లో పెద్ద ఎత్తున మట్టి,ఇనుప ఖనిజం,రాళ్లను తరలించుకుపోయారని, తవ్వకాలకు గుర్తుగా పలుచోట్ల లోయలు మిగిలాయని నేతాజీ తెలిపారు.
దేవునూర్ ఫారెస్ట్ బ్లాక్ లో జింకలు,కొండగొర్రెలు,నెమళ్లు,అడవి పందులు, కుందేళ్ళు వంటి వందలాది వన్యప్రాణులున్నాయని, వేల సంవత్సరాల నాటి ఆదిమానవుల సమాధులు దేవునూర్ ఫారెస్ట్ లో ఉన్నాయని బోర వివరించారు.ఎంతో చారిత్రక జీవవైవిధ్యం దేవునూర్ ప్రాంతం మైనింగ్ వ్యాపారుల రియల్టర్ల నుంచి ముప్పు ఎదుర్కొంటుందని,దేవునూర్ లో కొందరికి భూమి పట్టాలున్నాయనే సాకుతో,ఇటీవల భూముల ధరలు బాగా పెరగడంతో గుట్టలన్ని తమవే అంటూ వీటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బోర సుభాషన్న ఆరోపించారు.
దేవునూర్ ప్రాంతాన్ని రక్షిత అటవీ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియ 1996 లోనే మొదలైనా అది 2014 నాటికి ఆగిపోయిందని,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో తక్షణమే నోటిఫికేషన్ ఇస్తే కొంత రక్షణ ఏర్పడుతుందని బోరన్న పేర్కొన్నారు.దేవునూర్ ఇనుప రాతి గుట్టలను,అటవీశాఖ భూములను అధికారుల అండతో మైనింగ్ మాఫియా కొల్లగొడుతోంది.
రాత్రివేళ గ్రానైట్ ను,మట్టిని తరలిస్తున్నారని దేవునూర్ సర్పంచ్ చిర్ర కవిత కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినా ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని,ఇటీవల 3 ప్రైవేట్ కంపెనీలు మైనింగ్ కోసం టెండర్ వేశాయని లీజుకు ఇవ్వకుండా,అటవీ ప్రాంతాన్ని కాపాడాలని గ్రామ పంచాయతీ తరఫున దేవునూర్ ప్రజలు చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం చెత్తబుట్టలో వేసినట్లుగా వ్యవహరించడం బాధాకరమని బోరా సుభాషన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.దేవునూర్ తోపాటు 20 గ్రామాల ప్రజలకు, రైతులకు,జీవాలకు ఆధారంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కబ్జాదారులు కొల్లగొట్టకుండా గుట్టల్ని కాపాడాలని బోరన్న కోరారు.
కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం వేల్పుల గుట్ట తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగాయని,30 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతిస్తే 98 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు చేశారని,పాండురంగాపురం లో మైనింగ్ అనుమతి తీసుకున్న వ్యక్తికి ఐదెకరాల పొలం ఒక చోట ఉంటే మరొకచోట ఏమాత్రం అనుమతి లేకుండానే ప్రభుత్వ భూమిని గుట్టలను తవ్వుకుపోయారని, పాండురంగాపురం ప్రజల బాధలను కేసీఆర్ పట్టించుకోవాలని బోసన్న కోరారు.కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం,పడమటి నర్సాపురంలో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని,గుట్టలను ఇలాగే మింగుతున్నాడని,అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము,చందంపేట మండలాల అటవీ ప్రాంతంలోని గుట్టల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారని,రంగారెడ్డి జిల్లా యాచారం లోనూ, భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం నందా నందా గ్రామం లోనూ,భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగరం గ్రామంలోనూ,గతంలో పచ్చదనం- పరిశుభ్రతతో కళకళలాడిన వందలాది ఎకరాల అటవీ సంపద,గుట్టలను,కొండలను,మట్టిని కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను బోర సుభాష్ చంద్రబోస్ నేతాజీ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి సంపదను అక్రమంగా దోచుకుంటున్న వివరాలను వారి 9848540078 నెంబర్కు ఫోటోలు,వీడియోలు తీసి పంపాలని ప్రజలకు బోర సుభాషన్న విజ్ఞప్తి చేశారు.ప్రకృతి సంపద పరిరక్షణకు కొండలను,గుట్టలను, వన్యప్రాణులను,చారిత్రక కట్టడాలను,ప్రాంతాలను రక్షించుకొనుటకు,ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రకృతి రక్షణ ఉద్యమాన్ని నిర్మించుటకు ప్రజా ఉద్యమకారులు ఐక్యం కావాలని బోరన్న విజ్ఞప్తి చేశారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy