డబుల్ డెక్కర్ బస్సును ఇంటిగా మార్చుకున్న మోడల్.. దాని విశేషాలు తెలిస్తే ఫిదా..!

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు.ఇల్లు అనగానే జనజీవనానికి దూరంగా విలాసవంతమైన ప్రదేశంలో పిల్లర్లతో నిర్మించాలని చాలామంది తపన పడుతుంటారు.

 Model Hayley Rowson Truner Her Double Decker Bus Into Home, Double Dekker Bus, C-TeluguStop.com

కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచన చేసి కొత్త తరహాలో ఇళ్లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు.ముఖ్యంగా విదేశీయులు ఇంటిని ఏర్పాటు చేసుకునే విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఆ కలను నెరవేర్చుకునేందుకు వారు ఒంటరిగానే చాలా కష్టపడుతుంటారు.ఆ కోవకు చెందిన వారే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హేలీ రాసన్(28).

అమెరికాకి చెందిన హేలీ రాసన్ ఒక డబుల్ డెక్కర్ బస్సును తన ఇంటిగా మార్చుకోవాలని కలలు కనేది.పెరిగి పెద్దయిన తర్వాత ఆమె మోడల్ గా మారింది.

తన కాళ్లపై తాను నిలబడేందుకు.సరిపడా డబ్బు సంపాదించుకొని తన కలను నిజం చేసుకునేందుకు ఆమె భారీ నిర్ణయమే తీసుకుంది.

ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో ఈమె తన అడల్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.అయితే ఆమె ఓన్లీఫ్యాన్స్ ఛానల్ కు చాలామంది సబ్ స్క్రైబ్ చేసుకోవడంతో కొద్ది కాలంలోనే ఆమె బ్యాంకు ఖాతా వేల డాలర్లతో నిండిపోయింది.ఈ ఒక్క సంవత్సరంలోనే ఆమె £13,000 (రూ.13 లక్షలు) పైగా సంపాదించింది.

Telugu America, Bus, Changed, Latest, Hayley Rowson, Wales, Fans Website-Latest

అమెరికాలో ఒక గది ఇల్లు కొనాలంటేనే కనీసం 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.హేలీ వద్ద అంత డబ్బులు లేవు కాబట్టి ఆమె తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా రూ.3.27 లక్షలతో ఓ లండన్ డబుల్ డెక్కర్ బస్సు కొనుగోలు చేసింది.అదనంగా రూ.4 లక్షలతో సోలార్ ప్యానెళ్లు, ఇన్సులేషన్ బోర్డులు, బాయిలర్ తదితర గృహోపకరణాలు కొనుగోలు చేసింది.

Telugu America, Bus, Changed, Latest, Hayley Rowson, Wales, Fans Website-Latest

తర్వాత దాన్ని తక్కువ ఖర్చుతోనే ఇల్లుగా తీర్చిదిద్దుకుంది.ఇప్పుడు తన బస్సు ఇంటిని ఆమె నార్త్ వేల్స్‌లోని ఓ ఖాళీ జాగాలో పార్క్ చేసుకుంటోంది.డిసెంబర్ 25 క్రిస్మస్ నాటికి బస్సును మరింత అందమైన ఇంటిగా మలిచి తన కుక్క ఎరిక్, పిల్లులతో అన్ని ప్రదేశాల్లో ట్రావెలింగ్ చేస్తానంటోంది.ఇన్ స్టాగ్రామ్ ఖాతా (hayleyrowson) వేదికగా ఆమె తన బస్సు హోమ్ ఫొటోలను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.

అవి కాస్త ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube