డబుల్ డెక్కర్ బస్సును ఇంటిగా మార్చుకున్న మోడల్.. దాని విశేషాలు తెలిస్తే ఫిదా..!

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు.ఇల్లు అనగానే జనజీవనానికి దూరంగా విలాసవంతమైన ప్రదేశంలో పిల్లర్లతో నిర్మించాలని చాలామంది తపన పడుతుంటారు.

కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచన చేసి కొత్త తరహాలో ఇళ్లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు.

ముఖ్యంగా విదేశీయులు ఇంటిని ఏర్పాటు చేసుకునే విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఆ కలను నెరవేర్చుకునేందుకు వారు ఒంటరిగానే చాలా కష్టపడుతుంటారు.

ఆ కోవకు చెందిన వారే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హేలీ రాసన్(28).అమెరికాకి చెందిన హేలీ రాసన్ ఒక డబుల్ డెక్కర్ బస్సును తన ఇంటిగా మార్చుకోవాలని కలలు కనేది.

పెరిగి పెద్దయిన తర్వాత ఆమె మోడల్ గా మారింది.తన కాళ్లపై తాను నిలబడేందుకు.

సరిపడా డబ్బు సంపాదించుకొని తన కలను నిజం చేసుకునేందుకు ఆమె భారీ నిర్ణయమే తీసుకుంది.

ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో ఈమె తన అడల్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.అయితే ఆమె ఓన్లీఫ్యాన్స్ ఛానల్ కు చాలామంది సబ్ స్క్రైబ్ చేసుకోవడంతో కొద్ది కాలంలోనే ఆమె బ్యాంకు ఖాతా వేల డాలర్లతో నిండిపోయింది.

ఈ ఒక్క సంవత్సరంలోనే ఆమె £13,000 (రూ.13 లక్షలు) పైగా సంపాదించింది.

"""/"/ అమెరికాలో ఒక గది ఇల్లు కొనాలంటేనే కనీసం 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

హేలీ వద్ద అంత డబ్బులు లేవు కాబట్టి ఆమె తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా రూ.

3.27 లక్షలతో ఓ లండన్ డబుల్ డెక్కర్ బస్సు కొనుగోలు చేసింది.

అదనంగా రూ.4 లక్షలతో సోలార్ ప్యానెళ్లు, ఇన్సులేషన్ బోర్డులు, బాయిలర్ తదితర గృహోపకరణాలు కొనుగోలు చేసింది.

"""/"/ తర్వాత దాన్ని తక్కువ ఖర్చుతోనే ఇల్లుగా తీర్చిదిద్దుకుంది.ఇప్పుడు తన బస్సు ఇంటిని ఆమె నార్త్ వేల్స్‌లోని ఓ ఖాళీ జాగాలో పార్క్ చేసుకుంటోంది.

డిసెంబర్ 25 క్రిస్మస్ నాటికి బస్సును మరింత అందమైన ఇంటిగా మలిచి తన కుక్క ఎరిక్, పిల్లులతో అన్ని ప్రదేశాల్లో ట్రావెలింగ్ చేస్తానంటోంది.

ఇన్ స్టాగ్రామ్ ఖాతా (hayleyrowson) వేదికగా ఆమె తన బస్సు హోమ్ ఫొటోలను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.

అవి కాస్త ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి.

చిరంజీవి నెక్స్ట్ ఈ దర్శకులతోనే సినిమాలు చేయనున్నారా..?