రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం

నల్లగొండ జిల్లా:నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘు వీర్ రెడ్డి( Kunduru Raghuveer Reddy) విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయ( Balu Naik Nenavath )క్ చందంపేట మండలంలోని పోల్యానాయక్తండా,మూడుదండ్ల,చందంపేట మండల కేంద్రంలో గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాడ్లడుతూ తాను ఉమ్మడి చందంపేట మండలానికి ఎంతో రుణపడి వున్నానని,ఇప్పుడు ఋణం తీర్చుకునే అవకాశంవచ్చిందని,నియోజకవర్గంలో చందంపేట మండలాన్ని మొదటి స్థానంలో ఉంచుతానని హామీ ఇచ్చారు.

అతిత్వరలో నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేపిస్తానన్నారు.రైతులను దృష్టిలో ఉంచుకొని మండలంలోని ఇరవై ఐదు కుంటలకు,చెరువులకు నీరును అందించడానికి కాలువలకు మరమ్మతులు నిర్వహించి నింపుతున్నామని తెలిపారు.

మన దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు.అందరూ చెప్పుకునే వెనకబడిన ఈ చందంపేటను ముందు వరుసలో ఉంచుతానని, నల్లగొండ జిల్లాలోని చందంపేటను నాగర్ కర్నూల్ జిల్లాలోని సిద్ధాపూర్ ను కలుపుతూ ఒక బ్రిడ్జి నిర్మించే విధంగా కృషి చేసి రవాణా పరంగా అన్ని విధాల చందంపేటను అభివృద్ధి చేస్తానని చెప్పారు.

మండలంలోని ఫారెస్ట్ భూముల సమస్యలను కూడా పార్లమెంట్ ఎన్నికలు అవ్వగానే పూర్తి చేస్తామని మాటిచ్చారు.చెప్పిన పనులన్నీ త్వరితగతిన పూర్తి అవ్వాలంటే తమకు ఢిల్లోలో కూడా బలం వుండాలని,తనకు తోడుగా ఉండటానికి పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని మండల ప్రజలను కోరారు.

Advertisement

ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను ఎన్నికలు పూర్తి అవ్వగానే నెరవేర్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని,రైతుల రెండు లక్షల రుణమాఫిని ఆగస్టు15 లోగా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు.తనను గెలిపించడానికి కష్టపడిన కార్యకర్తలను ఈ ఐదు సంవత్సరాలు కంటికీ రేప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.

కొత్తగా పార్టీలో చేరినవారు,పాత వారు ఎలాంటి తేడా లేకుండా సమన్వయంతో కలుపుకొని అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిత్రియాల పిఏసిఎస్ చైర్మన్ జాల నర్సింహారెడ్డి,ఎంపీపీ పార్వతి నాయక్,జడ్పీటీసీ బుజ్జి లచ్చిరామ్,ఎంపీటీసీ నోముల మల్లయ్య,కో-ఆప్షన్ సాధిక్,మండల అధ్యక్షుడు భద్య నాయక్,ముత్యాల సర్వయ్య,అనంతగిరి శ్రీధర్, వెంకులు,యల్లయ్య,రాములు, కరీమ్,నజీర్,శిద్దు,శ్రీను, యుగేందర్,మక్డూమ్ బాబా, భాస్కర్,హరికృష్ణ,నగేష్, వెంకటయ్య,సురేష్,బలరామ్, కృష్ణయ్య,గిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News