నేలరాలిన మరో ధృవతార : 60 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి.. మిస్ యూఎస్ ఆత్మహత్య

సినీ, మోడలింగ్ రంగాల్లో వెలిగిపోవాలని భావించి ఎక్కడెక్కడి నుంచో నగరాలకు వస్తూ వుంటారు యువతీ, యువకులు.కానీ ఇక్కడ రాణించడం, అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత తేలిక కాదు.

 Miss Usa 2019 Cheslie Kryst Dies At 30 After Jumping From 60 Storey Building , M-TeluguStop.com

ఈ కలను నెరవేర్చుకోలేక.తిరిగి సొంతూరికి వెళ్లలేక సతమతమయ్యేవారు ఎందరో.

ఒకవేళ పట్టుదల, కృషితో ఛాన్సులు దక్కించుకుని కెరీర్ పీక్స్‌లో వున్న వేళ బలవన్మరణాలకు పాల్పడిన వారు కోకొల్లలు.తాజాగా అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.

మిస్ యూఎస్ఏ 2019 పోటీల్లో విజేతగా నిలిచిన చెస్లీ క్రిస్ట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.ఆమె వయసు 30 సంవత్సరాలు.ఆదివారం ఉదయం న్యూయార్క్‌‌లో తాను నివసిస్తున్న 60 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందపడి చెస్లీ ప్రాణాలు కోల్పోయారు.అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా , ప్రమాదవశాత్తూ జారీ పడిందా లేక ఎవరైనా వెనుక నుంచి తోసేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.

చెస్లీ క్రిస్ట్ హఠాన్మరణం ఫ్యాషన్‌ ప్రపంచంలో విషాదం నింపింది.మోడల్‌గానే కాకుండా ఫ్యాషన్‌ బ్లాగర్‌ గా, లాయర్‌, ఉద్యమకారిణిగా చెస్లీకి అమెరికన్లలో మంచి పేరుంది.

ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో మన్‌హట్టన్‌లో ఓ యువతి బిల్డింగ్‌పై నుంచి కిందపడి మరణించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.

మరణించిన యువతి చెస్లీ క్రిస్ట్‌గా తేలింది.పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగానే భావిస్తున్న పోలీసులు.పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే చెస్లీ మరణానికి కారణాలు చెప్పగలమని మీడియాకు తెలిపారు.

1991లో మిషిగాన్ జాక్సన్‌లో చెస్లీ జన్మించారు.సౌత్ కరోలినాలో ఆమె పెరిగారు.వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన చెస్లీ… లా పట్టా కూడా అందుకున్నారు.అనంతరం స్థానికంగా ఉన్న న్యూస్ ఛానల్‌‌లో రిపోర్టర్‌ గా పని చేసింది.2019లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న చెస్లీ క్రిస్ట్ 2019 మిస్ యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్నారు.పలు సమస్యలు, హక్కులపై గళమెత్తి బాధితులకు అండగా నిలిచారు.

Miss USA 2019 Cheslie Kryst Dies At 30 After Jumping From 60 Storey Building , Miss USA 2019, Chesley Christ, Model‌, Fashion Blogger, Lawyer, Activist, Manhattan, Michigan Jackson‌, Wake Forest University - Telugu Activist, Chesley Christ, Blogger, Manhattan, Usa, Usacheslie, Wake Forest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube