హైదారాబాద్ హైడ్రా తరహా మిర్యాలగూడ మిడ్రా రావాలి

నల్లగొండ జిల్లా:హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లేనని,ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినా చెరువుల అన్యాక్రాంతంపై నోరు విప్పలేదని,రేవత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీటీడీపీ నాయకులు పోగుల సైదులు గౌడ్ అన్నారు.

కానీ,అదే తరహాలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కూడా అన్యాక్రాంతమైన నాళాలు,పంటకాలువలు పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోడానికి మిడ్రా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అభివృద్ది పేరుతో నాళాలు కుదించి కట్టడం,పంట కాలువలు పూడ్చి వేయడం వలన వర్షాకాలంలో వీధులన్నీ జలమయం అవుతున్నాయన్నారు.పట్టణంలోని నాళాలపై చాలా చోట్ల కబ్జా చేసి నిర్మాణాలు వేలిశాయన్నారు.

ఇప్పటికే కొన్ని చోట్ల దీనిపై వాదనలు కూడా జరిగాయన్నారు.పెద్ద లీడర్లు ఆక్రమించిన చోట అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా అమాయకపు పేద ప్రజల నివాసాలపై చర్యల పేరుతో తొలగించడం చేయటం చూశామని,ఇప్పటికైనా ప్రభుత్వము రాజకీయ నాయకులకు వంత పాడకుండా నాళాలు, పంటకాలవలు పునరుద్ధరించాలని,అర్హులైన పేదలకు మరొక చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిన్నగూడెం రైతుల గోస ఎవరికీ పట్టదా...?
Advertisement

Latest Nalgonda News