ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ముగిసిన మంత్రుల సమావేశం

అమరావతి: ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ముగిసిన మంత్రుల సమావేశం.సూర్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత.

 Ministerial Meeting Concluded At Secretariat With Trade Unions Details, Ap Emplo-TeluguStop.com

సీపీఎస్ బదులుగా జీపీఎస్ అమలు చేస్తామనిన ప్రభుత్వం చెప్పింది.జీపీఎస్ వల్ల నష్టమని ప్రభుత్వానికి మేము నివేదిక రూపంలో చెప్పాం.

జీపీఎస్ ఆమోదం కాదని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా గతంలో తెలిపాం.సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ,మంత్రుల కమిటీ అధ్యయనం చేసిన అంశాలు చెప్పాలని ఇవాల కోరాం.జీపీఎస్ పై తొలి సమావేశంలో ఇచ్చిన నివేదిక ను మార్చి 2.0 అనే ఇంప్రూవుడ్ వర్షన్ ను ప్రభుత్వం ఇవాల పవర్ పాయింట్ ప్రెజెంటషన్ ఇచ్చింది.ఉద్యోగులకు రిటైర్డ్ అనంతరం 33-శాతం గ్యారెంటెడ్ పన్షన్ ఇస్తామని ఇవాల ప్రభుత్వం చెప్పింది.ఉద్యోగికి ప్రమాద,హెల్త్ బీమా,స్పౌజ్ పెన్షన్, పదివేల మినిమం పెన్షన్ ఇస్తామని చెప్పారు.

ఒపీఎస్ ను అమలు చేయలేమని ప్రభుత్వం ఇవాల స్పష్టంగా చెప్పింది.పాత పెన్షన్ పునరుద్దరిస్తామని సీఎం ఇచ్చిన రాజకీయ హామీ నెరవేర్చాలని కోరాం.

బండి శ్రీనివాస్, ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు.జీపీఎస్ పై తొలి సమావేశంలో చెప్పిన స్కీంకు స్వల్ప మార్పులు చేసి మంత్రులు ప్రదర్శించారు.రిటైర్మెంట్ తర్వాత 33శాతం పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఇవాల చెప్పింది.ఉద్యోగులకు,కుటుంబాలకు ప్రమాద, హెల్త్ బీమ అమలుచేస్తామని మంత్రులు చెప్పారు.

మినిమం పది వేల పించన్ ఇస్తామని చెప్పారు.గతంతో పోల్చితే మరింత ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు.

కొత్తగా చెప్పిన జీపీఎస్ స్కీంను ఒప్పుకునేది లేదని స్పష్టంగా చెప్పాం.రాజస్థాన్, చత్తీస్ ఘడ్ తరహాలో సీపీఎస్ ను రద్దు చేయాలని కోరాం.

ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరాం.సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరాం.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేయాలని కోరాం.ఉద్యోగులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని కోరాం.

ఉపాద్యయులకు ఒడి ని పునరుద్దరించాలని కోరాం.మెడికల్ బిల్లులను వెంటనే పేమెంట్ చేయాలని కోరాం.

ఒపీఎస్ నే మేము కోరుకుంచున్నాం తప్ప మరోటి కాదని స్పష్టంగా చెప్పాం.

హృదయరాజు, ఎపీటీఎఫ్ సెక్రటరీ జనరల్.

సీపీఎస్ రద్దు చేయాలి కోరాం.ఆందోళనలు తయకొనసాగిస్తామని చెప్పాం.

ఉద్యోగువపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరాం.

వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ అధ్యక్షుడు.

సీపీఎస్ రద్దు తప్ప మరోటి ఒప్పుకునేది లేదని చెప్పాం.ప్రభుత్వం మార్పు చేసి ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం.

సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతాయి.ఉపాద్యాయులంతా ఉద్యమానికి సిద్దం కావాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube