హమ్మో, బయటపడ్డ ఆడ పిశాచి అవశేషాలు.. దీని గురించి తెలిస్తే..

తాజాగా పోలాండ్‌లో పరిశోధకులు ఆడ రక్త పిశాచికి సంబంధించిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు.ఈ ఢాకిని లేదా రక్త పిశాచి మెడలో ఇనుప కొడవలి ఉంది.నివేదికల ప్రకారం, పోలాండ్‌లోని పియన్‌లోని 17వ శతాబ్దపు స్మశానవాటికలో ఈ పిశాచి అవశేషాలు బయటపడ్డాయి.17వ శతాబ్దపు నమ్మకం ప్రకారం, చనిపోయిన ఆడ రక్త పిశాచి మళ్లీ బతికి ప్రజలను వేధించుకుండా ఉండేందుకు దాని మెడలో కొడవలి వేస్తారట.ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

 Female Vampire Mortal Remains Found In Poland , Poland, Female Vampire Mortal ,-TeluguStop.com

నివేదిక ప్రకారం, ఈ రక్త పిశాచి అవశేషాలతో పాటు, ఒక పట్టు టోపీ, ఆమె కాలి బొటనవేలుకి కట్టిన తాళం కూడా దొరికాయి.

పట్టు టోపీ ఉంది కాబట్టి మరణించిన ఈ ఆడది ఉన్నత సామాజిక కుటుంబానికి చెందినదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఈ పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డారియస్జ్ పోలిన్స్కి నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన వారు.

ఆయన మాట్లాడుతూ, “కొడవలిని ఫ్లాట్‌గా పెట్టలేదు, కానీ చనిపోయిన ఆ జీవి లేవడానికి ప్రయత్నించినట్లయితే… అది సరిగ్గా మెడపై ఉండే విధంగా ఉంచారు.దీనివల్ల లేవడానికి ప్రయత్నిస్తే అది గాయపడుతుంది లేదా చనిపోతుంది” అని అన్నారు.

ఆ వాంపైర్ తిరిగి మళ్లీ బతకడాన్ని ఆపేలా తాళం ఉపయోగించినట్టు అతను చెప్పారు.రక్తాన్ని పీల్చే దెయ్యం లేదా మానవ మాంసాన్ని తినే దెయ్యం గురించి శతాబ్దాలుగా దాదాపు ప్రతి నాగరికత పురాణాలు, జానపద కథలలో చెప్పబడింది.

అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఒక ఆడ పిశాచి అస్తిపంజరం దొరికిందని చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్ అవుతున్నారు.దీని గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube